పరాయి దేశంలో ప్రాణాలు వదిలిన #పర్శరాం
- September 06, 2015
కరీంనగర్ జిల్లా ,చందుర్తి మండలం మూఢపల్లి గ్రామానికి చెందిన గోలి లింగారెడ్డి-లలితమ్మ గార్ల రెండవ కుమారుడు(పర్శరాం) Ramu Golli గత నాలుగు సంవత్సరాల క్రితం బతుకుదేరువు కోసం సౌదీ అరేబియా దేశానికివెళ్ళాడు.అక్కడ ఒక కంఫనీ లో డ్రైవర్ గా పనిచేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు రెండు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలో తలకు చిన్న గాయం తగిలింది.మామూలు గాయమే కదా అనీ ఆశ్రద్ద చేసిన పర్శరాం, ఆ గాయo విపరీతమైన నొప్పి రావడంతో, వారం రోజుల క్రితం తన దగ్గరలో వున్న స్వగ్రామానికి చెందిన స్నేహితుల సహకారంతో హస్పిటల్ వెళ్ళాడు.అప్పటికే తీవ్ర అవస్థతో వున్న పర్శరాం కి నోటిమాట, కాళ్లుచేతులకు స్పర్శ కూడ లేకపోవడంతో డాక్టర్ల్ చికిత్స కోసం ఫరీక్షలు నిర్వహిస్తే తలలో రక్తం గడ్డకట్టినట్టు తెలింది.వారం రోజుల నుండి ICU లో కోమాలో వున్న పర్శరాం శనివారం సాయంత్రం 4 గం॥ప్రాతంలో ప్రాణాలు విడిచాడు..
పర్శరాం మరణవార్త విన్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గత సంవత్సరo సెలవు పై ఇంటికి వచ్చి వెళ్లిన కొడుకు తిరిగిరాని లోకాలకు పొయాడు అనీ వాపోతున్నారు.పది సంవత్సరాల క్రితం పర్శరాం వాళ్ల అన్న రవి కూడ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు.వున్న ఇద్దరు ఎదిగిన కొడుకులు మరణించడంతో తల్లిదండ్రులకు తీరని లోటు ఏర్పడింది,
దయచేసి పర్శరాం మృతదేహన్ని త్వరగా స్వగ్రామానికి రప్పించడానికి ప్రభుత్వం చొరవతీసుకోవాలని అలాగే వారి కుటుంబాన్ని ఆదుకోవాలనీ చేతులెత్తి విఙ్ఞప్తి చేస్తున్నా.
పర్శరాం నా క్లాస్ మేట్ అలాగే మంచి మనస్తత్వం వున్న మనిషి. నీ మరణం నా జీవితంలో తీరని లోటురా పర్శీ...నీవు ఎక్కడ వున్న నీ ఙ్ఞాఫకాలు మా వెన్నంటే వుంటాయి. నీ ఆత్మకి శాంతి చేకూరాలనీ ఆ దేవున్ని మనస్పూర్తిగా కోరుకుంటూ..అలాగే మీ కుటుంబ సభ్యులకు నా ప్రగాడ సానుభూతి తెలియజేస్తూ....నీ మిత్రుడు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







