సిసిటివి ధ్వంసం: అప్పీల్‌ని తిరస్కరించిన కోర్టు..

- December 20, 2016 , by Maagulf
సిసిటివి ధ్వంసం: అప్పీల్‌ని తిరస్కరించిన కోర్టు..

మనామా: స్థానిక మాస్క్‌లో సెక్యూరిటీ కెమెరాను ధ్వంసం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు వ్యక్తుల అప్పీల్‌ని న్యాయస్థానం తిరస్కరించింది. ఇద్దరికీ ఆరు నెలల జైలు శిక్ష, అలాగే 1650 బహ్రెయినీ దినార్స్‌ జరీమానా ఇదివరకే న్యాయస్థానం విధించింది. పోలీసు విచారణలో మొత్తం 7 మంది నిందుతులుగా తేలారు. అయితే ఇందులో ముగ్గుర్ని ప్రధాన నిందితులుగా గుర్తించారు, మిగతా వ్యక్తులకు ఈ కేసు నుంచి ఉపశమనం లభించింది. ముగ్గురిలో ఓ వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. మిగతా ఇద్దరికీ అదే శిక్ష విధించగా, న్యాయస్థానంలో ఈ ఇద్దరూ అప్పీల్‌ చేసుకున్నారు. ఇంకో వైపున ముగ్గురికీ 500 బహ్రెయినీ దినార్ల పూచీ కత్తుతో బెయిల్‌ లభించడం జరిగింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com