గ్రాండ్ సెర్మనీ ద్వారా దుబాయ్ పార్క్స్ అండ్ రిసార్ట్స్ ప్రారంభం..
- December 20, 2016
మిడిల్ ఈస్ట్‌లో అతి పెద్ద థీమ్ పార్క్ డెస్టినేషన్ దుబాయ్ పార్క్స్ అండ్ రిసార్ట్స్ అధికారికంగా వ్యాపార కార్యకలాపాల్ని ప్రారంభించింది. దీనికి సంబంధించిన ప్రారంభ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. దుబాయ్ పార్క్స్ అండ్ రిసార్ట్స్‌లో మూడు ప్రత్యేకమైన థీమ్ పార్క్స్, ఓ వాటర్ పార్క్, అత్యద్భుతంగా తీర్చిదిద్దబడ్డ డైనింగ్ మరియు రిటెయిల్ డిస్ట్రిక్ట్, పోలినేషియన్ థీమ్‌డ్ ఫ్యామిలీ హోటల్ వంటివి ఇందులో పొందుపర్చారు. లెగోల్యాండ్ దుబాయ్ ఇందులో మరో ప్రధాన ఆకర్షణ. మోషన్ గేట్ దుబాయ్ పేరుతో హాలీవుడ్ ఇన్‌స్పైర్డ్ పార్క్ ఇంకో ప్రధాన ఆకర్షణ కానుంది. బాలీవుడ్ థీమ పార్క్‌ని కూడా ఇందులో ఏర్పాటు చేశారు. రివర్ ల్యాండ్ దుబాయ్‌తో ఈ మొత్తం డెస్టినేషన్‌ని కనెక్ట్ చేశారు. ప్రారంభోత్సవ వేడుకలో ఈ మొత్తం డెస్టినేషన్‌కి సంబంధించిన వివరాల్ని షోకేస్ చేశారు. బాలీవుడ్ మ్యూజికల్ షో, డాన్సింగ్ షో ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణలు. దుబాయ్‌తోపాటు మొత్తం మిడిల్ ఈస్ట్‌లోనే ఇది ప్రత్యేకమైన డెస్టినేషన్ అని డిఎక్స్‌బి ఎంటర్‌టైన్‌మెంట్స్ సిఇఓ, దుబాయ్ పార్క్స్ అండ్ రిసోర్ట్స్ అధిపతి రయీద్ కజూర్ అల్ నౌమి చెప్పారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







