ఆమె ట్రంప్ కు మద్దతు.. నేను రాజీనామా..
- December 20, 2016
సాప్ట్ వేర్ దిగ్గజాలో ఒకటైన ఒరాకిల్ కంపెనీ సీఈవో సాఫ్రా కాట్జ్ అమెరికాకు ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కు మద్దతుగా నిలుస్తున్నారనే నెపంతో తన పదవికే రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు ఓ సీనియర్ అధికారి. ట్రంప్ టీమ్ లో సాఫ్రా కాట్జ్ జాయిన్ అయ్యారని మండిపడుతూ ఒరాకిల్ డైరెక్టర్ జార్జ్ ఏ. పొలిస్నర్ తన రాజీనామా లేఖను లింక్డ్ఇన్ ద్వారా కంపెనీకి పంపించారు. ట్రంప్ పరివర్తన టీమ్ లో జాయిన్ అవుతూ సోషల్ సెక్యురిటీ, మెడికేర్, ఇమ్మిగ్రేషన్ పాలసీలపై తాము పనిచేస్తామని కాట్జ్ నిర్ణయం తీసుకున్నారు. అయితే తాను ట్రంప్ తో కలిసి పనిచేసేది లేదని, ఎట్టిపరిస్థితిల్లో ట్రంప్ కు సాయపడనని పేర్కొంటూ జార్జ్ ఒరాకిల్ కంపెనీకి లేఖ రాశారు.
ట్రంప్ విధానాలు రాజ్యాంగ విరుద్ధం, అనైతికం, నేరపూరితంగా ఉంటాయని ఆరోపించారు. ప్రతి సందర్భంలోనూ చట్టబద్ధంగా ఆయన్ను నేను వ్యతిరేసిస్తానని పేర్కొన్నారు.
లింక్డ్ఇన్ లో ఆయన పోస్టు చేసిన ఈ లేఖకు కనీసం 90 కామెంట్లు వచ్చాయి. వాటిలో చాలావరకు జార్జ్ కు మద్దతుగా నిలిచాయి. అయితే ఈ విషయంపై కంపెనీ అధికార ప్రతినిధి స్పందించలేదు. 1993 నుంచి జార్జ్ పొలిస్నర్ ఒరాకిల్ లో పనిచేస్తున్నారు. ఒరాకిల్ లో జాయిన్ అయిన దగ్గర్నుంచి వివిధ పదోన్నతులకు ఆయన బాధ్యత వహించారు. కన్సల్టింగ్, ప్రొడక్ట్ డెవలప్ మెంట్, కస్టమర్ అడ్వకసీ, ప్రొగ్రామ్ మేనేజ్ మెంట్, క్లౌడ్ వంటి వాటిలో ఆయన పనిచేశారు. డిసెంబర్ 15న టెక్ దిగ్గజాలతో ట్రంప్ నిర్వహించిన భేటీ అనంతరం కాట్జ్ ఆయనతో కలిసి పనిచేయనున్నట్టు వెల్లడించారు. ఒరాకిల్ సీఈవోగా ఉన్నంతవరకు ట్రంప్ తోనే కలిసి పనిచేస్తానని తెలిపిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







