సూర్య నటించిన కొత్త చిత్రం 'ఎస్ 3' జనవరి 26న!
- December 20, 2016
హరి దర్శకత్వంలో సూర్య నటించిన కొత్త చిత్రం 'ఎస్ 3'. గతంలో విడుదలైన 'సింగం' చిత్రానికి మూడో సీక్వెల్ ఇది. అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాణ సంస్థ సన్నాహాలు చేస్తోంది. నిజానికి ఈ సినిమాను డిసెంబరు ఆరంభంలో విడుదల చేయాలని అనుకున్నారు. కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఆ తర్వాత డిసెంబరు 23న తెరపైకి తీసుకురావాలని భావించారు. అదీ మారడంతో సంక్రాంతి బరిలోకి తీసుకెళ్లారు. ఇప్పుడు ఆ తేదీలోనూ మార్పు వచ్చినట్లు సమాచారం. ఇప్పుడు ఈ చిత్రాన్ని గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న విడుదల చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
సంక్రాంతి రోజున పలు సినిమాలు విడులవుతున్నందున వాయిదా పడిందని సమాచారం. ఒకట్రెండు రోజుల్లోనే అధికారికంగా ప్రకటించనున్నారు. దీంతో సూర్య అభిమానులు నిరాశకు గురవుతున్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







