బెర్లిన్‌లోని క్రిస్మస్ మార్కెట్లో ఉగ్రదాడికి పాల్పడింది మేమే: ఐసిస్..
- December 21, 2016
జర్మనీ రాజధాని బెర్లిన్‌లోని క్రిస్మస్ మార్కెట్లో జరిగిన ఉగ్రదాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్స్ స్టేట్స్ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేసింది. ఐసిస్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న ఓ న్యూస్ ఏజెన్సీ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. అంతర్జాతీయ కూటమిగా ఏర్పడిన దేశాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడి చేసినట్లు ఐసిస్ ప్రకటించుకుంది.
అమెరికాతో కలిసి సిరియా, ఇరాక్‌పై దాడి చేస్తున్న ఐఎస్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా జరిపే పోరాటంలో జర్మనీ భాగస్వామ్యం వహిస్తోంది. సోమవారం రాత్రి క్రిస్మస్ మార్కెట్లో ఉన్న పాదచారులపైకి ఓ నలుపు రంగు ట్రక్కు దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది.
ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా, 50 మంది గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ట్రక్కును నడిపిన పాకిస్థాన్‌కు చెందిన 23ఏళ్ల యువకుడిని జర్మనీ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







