శింబు చిత్రం విడుదలపై నిషేధం!
- December 21, 2016
సంచలన నటుడు శింబు చిత్రాలు ఈ మధ్య వివాదాలకు, సమస్యలకు కేరాఫ్‌గా మారాయని చెప్పవచ్చు. శింబు చిత్రాలకు ఆయన సమస్యగా మారడమో లేక ఆయన చిత్ర నిర్మాతలు సమస్యల వలయంలో చిక్కు కోవడమో జరుగుతోంది. శింబు నటించిన ఇటీవల విడుదలైన అచ్చంయన్బదు మడమైయడా నిర్మాణ దశలోనే పలు సమస్యలను ఎదుర్కొని ఎట్టకేలకు తెరపైకి వచ్చింది. ఈ చిత్ర షూటింగ్ సమయంలో శింబు బీప్ సాంగ్ వివాదంలో చిక్కుకోవడంతో విడుదల ఆలస్యమైంది.
కాగా తాజాగా శింబు అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రంలో త్రిపాత్రాభినం చేస్తున్నారు. మైఖెల్ రాయప్పన్ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కాగా ఈ చిత్ర నిర్మాత మైఖెల్ రాయప్పన్ తనకు రూ.
25 లక్షలు రుణం చెల్సించాల్సి ఉందని, అది తనకు చెల్లించే వరకూ అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్ర విడుదలపై నిషేధం విధించాలని ఫైనాన్సియర్ రమేష్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం ఈ నెల 23వ తేదీన బదులు పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా నిర్మాత మైఖెల్ రాయప్పన్‌కు నోటీసులు జారి చేసింది.
తాజా వార్తలు
- నేపాల్ పై భారత్-ఎ 306 పరుగుల చారిత్రక విజయం!
- ఒమన్ జాతీయ దినోత్సవ వేడుకలు..GCC దేశాల్లో ఒమన్ జెండా రంగులతో మెరిసిన భవనాలు
- ఒమన్ 56వ జాతీయ దినోత్సవ వేడుకలు..ఒమన్ ప్రయాణికులకు షార్జా విమానాశ్రయం ప్రత్యేక స్వాగతం
- ట్రాఫిక్‌ను తప్పించుకునేందుకు రోడ్ షోల్డర్ పై వాహనాలు నడిపితే జరిమానా..
- ఆధార్ కార్డు ఉన్నవారికి బిగ్ అలర్ట్..
- షార్జా రూలర్ షేక్ సుల్తాన్ బిన్ మహమ్మద్ అల్ ఖాసిమికి విజయవంతంగా శస్త్రచికిత్స
- పిఠాపురంలో మోడల్ అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన ఉపాసన
- దుబాయ్‌లో భారీగా తగ్గిన బంగారం ధరలు..13 నెలల కనిష్ఠానికి ధర..!!
- KAFD పై దాడులను తీవ్రంగా ఖండించిన GCC..!!
- UNO సూచీలో ఒమన్‌కు మెరుగైన ర్యాంకు..!!







