శ్రీకాంత్ తనయుడు రోషన్ కు తారల భారీ హంగామా !!
- September 06, 2015
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అప్పుడప్పుడు కొద్దిపాటి జిమ్మిక్ లు జరుగుతుంటాయి. అటువంటి సమయంలో ప్రేక్షకులు వాటిని చూసిన ఆనందించాలి. సరిగ్గా అటువంటిదే తాజాగా ఓ అప్ కమింగ్ మూవీలోనూ జరగబోతుంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే,కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్ చెయ్యడంలో, కొత్త తరహా చిత్రాల్ని నిర్మించడంలో ఎప్పుడూ ముందుండే కింగ్ నాగార్జున ఇప్పుడు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఓ కొత్త హీరోని పరిచయం చేస్తున్నారు. మ్యాట్రిక్స్ టీమ్ వర్క్స్ తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న నిర్మల కాన్వెంట్ చిత్రం ద్వారా రోషన్ అనే కొత్త హీరో పరిచయమవుతున్నాడు. శ్రీకాంత్ తనయుడిగా రోషన్ అందరికి తెలుసు. అయితే తన తనయుడి డెబ్యూ మూవీలోని ఓ స్పెషల్ సాంగ్ లో దాదాపు 21 మంది టాప్ యాక్టర్స్ కనిపిస్తారంట. అందరకూ ఒక్కక్కరిగా కాకుండా, అందరూ కలిసి ఒకే సీన్ కనిపించడటం విశేషం. దీనికి సంబంధించిన టాక్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తున్నాయి. త్వరలోనే ఆ సాంగ్ కి సంబంధించిన షూటింగ్ ని ఫూర్తి చేసే ప్లానింగ్ లో ఉంది చిత్ర యూనిట్. శ్రీకాంత్ తనయుడు రోషన్ డెబ్యూ ఫిల్మ్ లో కనిపించటానికి ప్రతి హీరో పాజిటివ్ గా స్పందించారు. మొత్తంగా శ్రీకాంత్ తన కొడుకు మూవీకి సూపర్ హైప్ ని క్రియేట్ చేశాడని అంటున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







