ఖతార్ చిన్నారులకు రెడ్ క్రాస్ శిక్షణ

- September 06, 2015 , by Maagulf
ఖతార్ చిన్నారులకు రెడ్ క్రాస్ శిక్షణ

గాయపడినపుడు లేదా ఇతర అత్యవసర  పరిస్థితులలో ప్రాధమిక సహాయం అందించడం అనే అంశంపై , ద ఖతార్ రెడ్ క్రాస్ సొసైటీ నిపుణులచే రెండు ప్రసంగాలను ఏర్పాటు చేసింది. మొదటి విడతగా ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ లీడర్షిప్ డేవలప్‌మెంట్ ఆవరణలో 8 నుండి 16 సంవత్సరాల వయసు గల 25 మంది పిల్లలకు  ఆంబ్యులెన్స్ ను సంప్రదించే విధానం, పరిస్థితిని సరిగ్గా వివరించడం, వైద్య సహాయం అందేవరకు సూచనల పాటించడం, ముఖ్యంగా హృదయ స్పందనను(CPR) తిరిగి తెప్పించడం వంటి విధానాలను గూర్చి శిక్షణ నిచ్చారు.   కాలిన గాయాలు, దెబ్బలు, రక్తస్రావం, ముక్కు నుండి రక్తశ్రవం, బెణుకులు , ఎముక విరగడం, ఉపిరి ఆడకపోవడం, అలర్జీలు మరియు వడదెబ్బ వంటి  వివిధ పరిస్థితుల్లో, బాధితులు  స్పృహ ఉన్న పద్ధతిని బట్టి అందించదగిన సహాయాన్ని గుర్తించడం మరియు స్పృహ కోల్పోయినవారిని రక్షించడం వంటి వాటిపై కూడా నిపుణులు తర్ఫీదునిచ్చారు.  ఇక రెండవ కార్యక్రమంలో, 32 మంది విద్యార్ధులు మరియు సెంటర్ యొక్క నిర్వహణా సిబ్బంది వేసవి శిబిరంలో సాంస్కృతిక మరియు క్రీడా కార్యక్రమాల్లో  పాల్గొన్నారు. ఇంకా, ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు సహాయమందించేటపుడు దొర్లే పొరబాట్లను గురించి కూడా వివరించారు. ఈ కార్యక్రమం వలన పిల్లలు ఇతరులను మాత్రమే కాకుండా తమకు అపాయం వచ్చినపుడు కూడా ధైర్యంగా వ్యవహరించగలరని పలువురు ప్రశంసించారు.

 

--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com