ప్రస్తుతం ఫిట్ గా ఉన్న కమల్ హాసన్!

- December 21, 2016 , by Maagulf
ప్రస్తుతం ఫిట్ గా ఉన్న కమల్ హాసన్!

లోకనాయకుడు కమల్ హాసన్ కొంత కాలంగా ఇంటికే పరిమితమయ్యాడు. తన ఇంట్లో జరిగిన ప్రమాదంలో గాయపడిన కమల్ సెట్స్ మీద ఉన్న శభాష్ నాయుడు సినిమా షూటింగ్ ను కూడా ఆపేయాల్సి వచ్చింది. దాదాపు ఐదు నెలలకు పైగా షూటింగ్ వాయిదా వేసిన కమల్, ఇప్పుడు పూర్తి ఫిట్ గా కనిపిస్తున్నాడు. కొద్ది రోజులుగా బయట ఎక్కడా కనిపించిన లోకనాయకుడు తాజాగా చెన్నై ఎయిర్ పోర్ట్ లో కనిపించాడు.

ప్రస్తుతం ఫిట్ గా ఉండటంతో జనవరి మొదటి వారంలోనే శభాష్ నాయుడు షూటింగ్ ను తిరిగి ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు. అంతేకాదు కమల్ డ్రీమ్ ప్రాజెక్ట్ మురుదనాయగం సినిమాను కూడా తిరిగి ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు కమల్. శభాష్ నాయుడు సినిమాను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ సంస్థ మురుదనాయగం ను తిరిగి ప్రారంభించేందుంకు ప్లాన్ చేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com