పురుషులపై ఆధారపడను అంటున్న.. గ్లోబల్‌స్టార్ ప్రియాంక చోప్రా!
- December 21, 2016
త న ప్రతిభతో హాలీవుడ్‌లోనూ అవకాశాలను సంపాదిస్తూ గ్లోబల్‌స్టార్‌గా ఎదుగుతోంది బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా. త్వరలోనే తన తొలి హాలీవుడ్ చిత్రం 'బేవాచ్' ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా.. ఇటీవల భారత్‌కి తిరిగొచ్చిన ప్రియాంకని గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు పొందాక.. చుట్టూ ఉండేవాళ్ల ప్రవర్తనలో ఏమైనా మార్పుని గమనించారా? అని అడిగితే ఆసక్తికరమైన సమాధానమిచ్చింది.
''అలాంటి విషయంపై ఇంతవరకు శ్రద్ధ పెట్టలేదు. దాని గురించి ఆలోచించడం కూడా ఇష్టం ఉండదు. అలాగే ఫేమస్ కావాలని ఇండస్ట్రీకి రాలేదు.
అనుకోకుండా గుర్తింపు వచ్చింది. కానీ ఫేమస్ అవ్వడం కంటే నటిగా విజయాన్ని సాధించినప్పుడే సంతృప్తి చెందుతా. ఈ క్రమంలో ఎవరి మీద ఆధారపడను. మనది పురుషాధిక్య సమాజం.
కాబట్టి మహిళలు ఎలాంటి భయం లేకుండా ప్రయత్నించినప్పటికీ చివరకి పురుషుల మీదనే ఆధారపడుతుంటారు. కానీ నేను అలా కాదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు నన్ను పురుషులతో సమానంగా పెంచారు. కాబట్టి పురుషుల మీద ఆధారపడకుండా ఏదైనా సాధించగలననే నమ్మకం ఉంది.
అలాగే గతంలో సాధించిన విషయాలను తలచుకుంటూ విశ్రాంతి తీసుకోవడం అంటే నాకు నచ్చదు. ఎప్పుడూ తర్వాత ఏం చేయాలనే దానిపైనే నా ఆలోచన ఉంటుంది.'' అని చెప్పుకొచ్చింది ప్రియాంక చోప్రా.
తాజా వార్తలు
- మన కళలు,సంస్కృతికి నిదర్శనం విజయవాడ ఉత్సవ్: మంత్రి కందుల దుర్గేష్
- అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు!
- ముదిరిన SIR వివాదం ..CEC రాజీనామాకు ఖర్గే డిమాండ్
- అబుదాబిలో బాల్కనీలు, రూఫ్‌టాప్‌లపై వస్తువులు పెడితే భారీ జరిమానా
- ఖతార్ లో ప్రత్యేక వాహన రిజిస్ట్రేషన్ నంబర్లకు దరఖాస్తులు ఆహ్వానం..!!
- అక్టోబర్ 1 నుంచి ఒమన్‌లో 1,546 వస్తువులపై జీరో వ్యాట్..!!
- ఒమన్ లో కన్జుమర్ కాన్ఫిడెన్స్ సర్వే నిర్వహిస్తున్న ఎన్సీఎస్ఐ..!!
- అల్ షహీద్ పార్క్ మూడో దశ ప్రారంభోత్సవం.. రెండు రోజుల కార్నివాల్..!!
- అక్టోబర్ 21న రియాద్ సీజన్ 2026 ప్రారంభం..!!
- బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ లో ఆకట్టుకున్న పీస్ డే ప్రోగ్రామ్స్..!!







