మహిళల్ని కారులో బంధించిన డ్రైవర్..
- December 22, 2016
27 ఏళ్ళ ఓ కారు డ్రైవర్, తన కారులో ఇద్దరు మహిళల్ని బంధించిన కేసుపై విచారణ జరుగుతోంది. అల్ బర్షా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. తనకు చెల్లించాల్సిన 20 దిర్హామ్‌లు చెల్లించనందుకుగాను తాను వారిని బంధించవలసి వచ్చిందని కారు డ్రైవర్ కోర్టుకి తెలిపాడు. అయితే బాధితుల వెర్షన్ ఇంకోలా ఉంది. మీటర్ వెయ్యకుండా కారుని నడుపుతున్నందున తాము, డ్రైవర్ని ప్రశ్నించామని అయితే ఈ క్రమంలో తమతో డ్రైవర్ వాగ్వాదానికి దిగాడని వారు అంటున్నారు. ఈ ఘటనలో ప్రత్యక్ష సాక్షి అయిన ఓ గార్డ్ మాట్లాడుతూ, తమ సంస్థలో పనిచేసే రిసెప్షనిస్ట్ తమ కార్యాలయం బయట కారులో వాగ్వాదం జరుగుతున్న విషయాన్ని తన దృష్టికి తీసుకురావడంతో అక్కడికి వెళ్ళానని చెప్పాడు. తాను వెళ్ళే సరికి కారులో మహిళలు ఉన్నారని, డబ్బు చెల్లించకపోవడంతోనే వారిని కారులో ఉంచానని డ్రైవర్ చెప్పినట్లు గార్డు, న్యాయస్థానానికి తెలిపాడు. బాధిత మహిళల్లో ఒకరు, డబ్బు సమస్య కాదని డ్రైవర్ వేధిస్తున్నట్లు చెప్పినట్లు వివరించాడు. ఈ కేసులో తదుపరి విచారణ జనవరి 10న జరుగుతుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







