బడా బాబుల అరెస్ట్‌లు..పలుచోట్ల భారీగా కొత్త నోట్లు..
- December 22, 2016
పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు మార్పిడి ముఠాల ఆగడాలు పెద్ద ఎత్తున బయట పడుతున్నాయి. కొందరికి కోట్లలో కొత్త కరెన్సీ అందుబాటులోకి వచ్చింది. పోలీస్, ఐటీ దాడుల్లో కొత్త నోట్లు భారీగా బయటపడుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ లోని సంభాల్ లో 20 లక్షల 31 వేల రూపాయల విలువైన కొత్త కరెన్సీ నోట్లను పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. అటు చెన్నై ఎయిర్ పోర్టులో కోటీ 34 లక్షల రూపాయల విలువైన నోట్లను పట్టుకున్నారు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. కోల్ కతాలో బడా హవాలా దళారి పారస్ మాల్ లోధాను పోలీసులు అరెస్ట్ చేశారు. దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా ఆయన్ని పట్టుకున్నారు. టీడీపీ మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డికి మనీ లాండరింగ్ లో లోధా సహకరించాడని , 25 కోట్ల రూపాయల మార్పిడికి సహాయం చేశాడని అధికారులు తెలిపారు. చెన్నైలో ట్రెజరీ సెక్రటరీ నాగరాజన్ నివాసంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మరోవైపు, ఢిల్లీ రైల్వే స్టేషన్ లో ఓ వ్యక్తి నుంచి 31 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో ప్రత్యేక వాహన రిజిస్ట్రేషన్ నంబర్లకు దరఖాస్తులు ఆహ్వానం..!!
- అక్టోబర్ 1 నుంచి ఒమన్‌లో 1,546 వస్తువులపై జీరో వ్యాట్..!!
- ఒమన్ లో కన్జుమర్ కాన్ఫిడెన్స్ సర్వే నిర్వహిస్తున్న ఎన్సీఎస్ఐ..!!
- అల్ షహీద్ పార్క్ మూడో దశ ప్రారంభోత్సవం.. రెండు రోజుల కార్నివాల్..!!
- అక్టోబర్ 21న రియాద్ సీజన్ 2026 ప్రారంభం..!!
- బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ లో ఆకట్టుకున్న పీస్ డే ప్రోగ్రామ్స్..!!
- 48 గంటల్లో ఐరిష్ క్రైమ్ బాస్ అరెస్ట్.. 82 ప్రాపర్టీలు సీజ్..యూఏఈ మంత్రి..!!
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్







