పొట్టి రమేష్ నా కుమార్తెను ఎన్నడూ వేధించలేదు...!!

- December 22, 2016 , by Maagulf
పొట్టి రమేష్ నా కుమార్తెను ఎన్నడూ వేధించలేదు...!!

పొట్టి రమేష్ బుల్లి తెరపై చిన్న పాటి కమీడియన్ గా రాణిస్తున్న సంగతి అందరికీ విదితమే. పొట్టి రమేష్ భార్య త్రిపురాంబిక గత రెండు రోజుల క్రితం అత్తింటి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు అన్ని కోణాల్లో క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం పై పొట్టి రమేష్ తో సహా అతని కుటుంబ సభ్యులందరిపై విచారణ జరుపుతున్నారు. అయితే త్రిపురాంబిక ఆత్మహత్య వెనక ఆయన భర్త పొట్టి రమేష్ హస్తం ఏమైనా ఉందా అన్న కోణంలో పోలీసులు త్రిపురాంబిక తల్లిని ప్రశ్నించారు.

తన కుమార్తె త్రిపురాంబిక ఆత్మహత్య వెనుక అల్లుడు పొట్టి రమేష్ ప్రమేయం లేదని, ఆయన ఏనాడూ తన కుమార్తెను వేధించలేదని త్రిపురాంబిక తల్లి పుష్పలత పోలీసులకు స్పష్టం చేశారు. త్రిపురాంబిక ఆత్మహత్య కేసులో అతని పేరును చేర్చవద్దని కోరారు. గడచిన ఏడాదిగా త్రిపురాంబిక అత్తమామలు, ఆడపడుచు మహాలక్ష్మి, ఆమె భర్త మల్లికార్జునరావులు అమ్మాయిని వేధించారని, వారిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.

కాగా, అప్పటికే సెక్షన్ 304 బీ కింద కేసును రిజిస్టర్ చేసిన పోలీసులు, రమేష్ ను సైతం అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నటుడు, డ్యాన్సర్ గా రాణిస్తూ, జబర్దస్త్ కార్యక్రమంతో పేరు తెచ్చుకున్న రమేష్ భార్య త్రిపురాంబిక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. త్రిపురాంబిక ఆత్మహత్యకు అత్తింటి వేధింపులే కారణమని ప్రాథమిక విచారణలో తేలినట్టు వెల్లడైందని పేర్కొన్న పోలీసులు, కేసును మరింత లోతుగా విచారిస్తున్నట్టు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com