పాస్‌పోర్టుకు కొత్త నిబంధన ప్రకటించిన కేంద్ర విదేశాంగశాఖ..

- December 23, 2016 , by Maagulf
పాస్‌పోర్టుకు కొత్త నిబంధన ప్రకటించిన కేంద్ర విదేశాంగశాఖ..

కేంద్ర విదేశాంగశాఖ పాస్‌పోర్టుకు కొత్త నిబంధన ప్రకటించింది. ఆధార్‌కార్డును జనన ధ్రువీకరణ పత్రంగా స్వీకరిస్తామని విదేశాంగ శాఖ తెలిపింది. జనన ధ్రువీకరణ పత్రం లేనివారు పాస్‌పోర్టు పొందాలంటే అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చేది. కేంద్ర విదేశాంగ తీసుకున్న తాజా నిర్ణయంతో జనన ధ్రువీకరణ పత్రం కోసం ఇబ్బందులు పడాల్సిన అవసరం లేకుండాపోయింది. ఆధార్‌కార్డులో నమోదైన వివరాలనే పాస్‌పోర్టు అధికారులు జనన ధ్రువీకరణ పత్రంగా పరిగణిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com