ఆంధ్ర,తెలంగాణ రాష్ట్రాల్లో 12 పార్టీలు రద్దు

- December 23, 2016 , by Maagulf
ఆంధ్ర,తెలంగాణ రాష్ట్రాల్లో 12 పార్టీలు రద్దు

ఎన్నికలకు దూరంగా ఉన్న నమోదిత రాజకీయ పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) కొరడా ఝుళిపించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన 12 రాజకీయ పార్టీల నమోదును రద్దు చేసింది. 2005 సంవత్సరం నుంచి జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయని పార్టీలను గుర్తించాలని ఎన్నికల సంఘం భావించి కసరత్తు చేసింది. ఆయా పార్టీల నమోదు సందర్భంగా పేర్కొన్న చిరునామాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి తర్వాత నిర్ణయం తీసుకున్నట్లు సీఈసీ పేర్కొంది.
ఈసీ రద్దు చేసిన రాజకీయ పార్టీలు 
* ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ 
* అన్న తెలుగుదేశం పార్టీ 
* ఆంధ్రనాడు పార్టీ 
* జై తెలంగాణ పార్టీ 
* తెలంగాణ ప్రజా పార్టీ 
* తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ 
* ముదిరాజ్‌ రాష్ట్రీయ సమితి 
* నేషనల్‌ సిటిజన్‌ పార్టీ 
* సత్యయుగ్‌ పార్టీ 
* భారతీయ సేవాదళ్‌ 
* ఆల్‌ ఇండియా సద్దుగణ పార్టీ 
* బహుజన రిపబ్లికన్‌ పార్టీ

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com