హర్రర్‌ చిత్రం 'సదురఅడి 3500'

- December 23, 2016 , by Maagulf
హర్రర్‌ చిత్రం 'సదురఅడి 3500'

 రైట్‌వ్యూ సినిమాస్‌ బ్యానరుపై తెరకెక్కుతున్న హర్రర్‌ చిత్రం 'సదురఅడి 3500'. స్టీఫన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. చెన్నైలో చోటుచేసుకున్న ఓ వాస్తవ ఘటన ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో ఇనియా కీలకపాత్ర పోషిస్తోంది. సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ... '' ఈ కథలో ఇనియా నటిస్తే బాగుంటుందని భావించాం.

కథ విన్న వెంటనే ఒప్పుకున్నారు. ఈ విషయంలో ఆమెకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. ఇందులో ఓ ముఖ్యమైన పాత్రలో రహమాన్‌ నటిస్తున్నారు. గతంలో వచ్చిన దెయ్యం చిత్రాలకు భిన్నంగా ఉంటుందీ సినిమా.

ప్రతాప్‌పోతన్‌, ఎంఎస్‌ భాస్కర్‌, మనోబాలా, కోవై సరళ తదితరులు ఇతర తారాగణం. మరో కీలక పాత్రలో తెలుగు 'ఐస్‌క్రీం' చిత్రం ద్వారా పరిచయమైన స్వాతిదీక్షిత్‌ నటిస్తున్నార''ని తెలిపారు. ఈ సినిమాకు స్వరాలను గణేశ్‌ రాఘవేంద్ర అందిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com