డ్రైవింగ్ లైసెన్స్ ఇకపై ఈజీ కాదు
- September 06, 2015
ఐడీటీఎస్ ద్వారా పరీక్ష..కొత్తగా స్మార్ట్ ట్రాక్‌లువచ్చే నెలనుంచి అందుబాటులోకి
డ్రైవింగ్ లైసెన్సు పొందడం ఇకపై అంత తేలికేం కాదు. ఇప్పటివరకు తూ తూమంత్రంగా నడిపినా వచ్చినా కూడా ఈజీగానే లైసెన్సు వచ్చేసేది. ఇకపై మాత్రం అలా కాదు. వాహనం నడిపేవారి సామర్థ్యాన్ని పూర్తిగా పరీక్షించే సాంకేతిక పరిజ్ఞానం రవాణా శాఖకు అందుబాటులోకి రానుంది. ‘ఇన్నోవేటివ్ డ్రైవింగ్ టెస్టింగ్ సిస్టం (ఐడీటీఎస్)’ పేరుతో రూపుదిద్దుకున్న ఈ పరిఙ్ఞానాన్ని తెలంగాణ రవాణా శాఖ వచ్చే నెలనుంచి రాష్ట్రంలోని వివిధ డ్రైవింగ్ ట్రాక్‌ల్లో ప్రవేశపెట్టనుంది. మూడు రోజుల క్రితం తెలంగాణ రవాణాశాఖ అధికారులు.. పుణే ఐడీటీఆర్ (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ట్నైనింగ్ అండ్ రీసెర్చ్)ను సందర్శించి వచ్చారు. ఈ విధానంలో డ్రైవింగ్ ట్రాక్‌లపై రెండు వైపులా సెన్సార్లను ఏర్పాటు చేస్తారు. డ్రైవర్ వాహనం నడుపుతున్నప్పుడు.. ఏ మాత్రం తేడా వచ్చినా ఈ సెన్సార్లు పసిగడతాయి. స్మార్ట్ ట్రాక్‌లుగా వ్యవహరిస్తారించే ఈ ట్రాక్‌లపై.. మొత్తం డ్రైవింగ్ ప్రక్రియను టూడీలో వీడియో కెమెరాల ద్వారా రికార్డు చేస్తారు. సెన్సార్లు, కెమెరాల ద్వారా వచ్చే సమాచారాన్ని క్రోడీకరించి సామర్ధ్యాన్ని బట్టి ఆటోమేటిక్‌గా మార్కులు పడతాయి. ఈ మార్కులను బట్టే డ్రైవింగ్ లైసెన్సు ఇవ్వాలో, వద్దో నిర్ణయిస్తారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









