నందమూరివారి పంచెకట్టు ఫంక్షన్...
- December 24, 2016
తూర్పుగోదావరి జిల్లా కరప మండలం వేళంగికి పండగ కళ వచ్చింది. నందమూరి వారసులు కుటుంబసమేతంగా తరలివచ్చారు. నందమూరి హరికృష్ణ, హీరోలు కళ్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్‌లు రావడంతో అక్కడ సందడే సందడి. హరికృష్ణ కుమారుడు దివంగత జానకీరామ్ కుమారులు తారకరామారావు(13), సౌమిత్రి ప్రభాకర్‌రావు(11)లకు పంచెకట్టు ఫంక్షన్ నిర్వహిస్తున్నారు. వేళంగిలో హరికృష్ణ వియ్యంకుడు యార్లగడ్డ ప్రభాకర్‌రావు ఉంటున్నారు. జానకీరామ్ బావమరిది అయిన యార్లగడ్డ కార్తీక్ నందమూరి వారసులకు పంచెకట్టు వేడుకను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. పంచకట్టు ఫంక్షన్ కోసం పిల్లలిద్దరూ వేళంగిలోనే ఉన్నారు. ఇందులో పాల్గొనేందుకు వచ్చిన తాతయ్య నందమూరి హరికృష్ణ, బాబాయ్‌లు కళ్యాణ్‌రామ్, జూ.ఎన్టీఆర్‌లను చూడగానే వారిద్దరూ పరుగున వెళ్లి ఆలింగనం చేసుకున్నారు.
వారి ఆప్యాయతను చూడగానే అక్కడున్న వారి కళ్లు చెమ్మగిల్లాయి. చిన్నారులిద్దరికీ పట్టుబట్టలు అందజేసి ఆశీర్వదించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







