ఓం నమో వేంకటేశాయ డైలాగ్ టీజర్ రిలీజ్..
- December 24, 2016
కింగ్ నాగార్జున.. మరోసారి భక్తాగ్రేసరుడిగా నటిస్తున్న భక్తిరస చిత్రం ఓం నమో వేంకటేశాయ. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో భారవి కథా కథనాలు అందిస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమా., ఫిబ్రవరి రెండో వారంలో రిలీజ్ కు రెడీ అవుతోంది. ప్రస్తుతం షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా తొలి డైలాగ్ టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
సినిమాలోని పాత్రదారులందరినీ పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన ఈ టీజర్ లో నాగ్ ను భక్తుడిగానే కాక.. ధర్మం కోసం ఎవరినైనా ఎదిరించే వ్యక్తిగా చూపించారు. తొలిసారిగా తెలుగు తెర మీద కనిపించిన సౌరభ్ జైన్ వేంకటేశ్వరుని పాత్రలో ఆకట్టుకున్నాడు.
దర్శకేంద్రుడి మార్క్ విజువల్స్ తో తెరకెక్కిన ఓం నమో వేంకటేశాయ నాగార్జున కెరీర్ లో మరో మైల్ స్టోన్ గా నిలుస్తుందన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్.
తాజా వార్తలు
- వైరల్ వీడియోల పై ఒమన్ పోలీసులు దర్యాప్తు.. చట్టపరమైన చర్యలకు సిద్ధం
- ఎన్నిక ఏదైనా కూటమిదే ఘనవిజయం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్ మెరీనాలో 670 మంది కార్మికులకు భద్రత, సామాజిక అవగాహన కార్యక్రమాలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్‌లు విడుదల.. పరిమిత సంఖ్యలో విక్రయాలు
- గల్ఫ్ ప్రవాసులకు ఆన్లైన్లో ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు
- OMCAP ఆధ్వర్యంలో జర్మనీలో ఉద్యోగాలకు 55 మంది ఏపీ నర్సుల ఎంపిక..
- మారిషస్ స్టేట్ హౌస్‌లో డా.గజల్ శ్రీనివాస్ గానం
- తెలంగాణను దేశంలో అగ్రశ్రేణి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి
- ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలకు కొత్త ఊపిరి పోస్తున్న లేపాక్షి
- తెలంగాణ జైళ్ల శాఖకు అరుదైన గౌరవం.. 109వ స్కోచ్ అవార్డు







