బహ్రెయినీ మహిళ హత్య..

- December 24, 2016 , by Maagulf
బహ్రెయినీ మహిళ హత్య..

మనామా: బహ్రెయినీ మహిళ ఒకరు హత్యకు గురైన ఘటన రిఫ్ఫాలో చోటు చేసుకుంది. మృతురాలిని ఇమాన్‌ ఘులూమ్‌గా గుర్తించారు. ఈమె ముహరాక్‌ నివాసి. హత్య జరిగిన సమయంలో ఆమె తన కుమారుడితో కలిసి ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ ఘటనలో మృతురాలి కుమారుడికి ఏమీ జరగలేదు. ఇంటీరియర్‌ మినిస్ట్రీ ఈ ఘటనను ధృవీకరించింది. 'సదరన్‌ గవర్నరేట్‌ పరిధిలో ఓ మహిళ హత్యకు గురైంది' అని ప్రకటించింది ఇంటీరియర్‌ మినిస్ట్రీ. దుండగులు ఆమెను హత్య చేసి పారిపోయినట్లుగా అనుమానిస్తున్నారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారమ్‌. కేసు విచారణ కొనసాగుతోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com