దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ 2017 కౌంట్‌డౌన్ ప్రారంభం ..
- December 24, 2016
అధికారికంగా దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ 2017 కౌంట్‌డౌన్ ప్రారంభమయ్యింది. కేవలం నాలుగు రోజులు మాత్రమే ఉంది దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి. 22వ దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ షాపింగ్ ప్రియుల్ని అలరించనుంది. 12 గంటల పాటు సాగే నాన్‌స్టాప్ న్యూ ఇయర్ షాపింగ్ ఫెస్టివల్లో అనూహ్యమైన బహుమతులు గెలుచుకునే అవకాశం ఉంది. 50,000 దిర్హామ్‌ల విలువైన మాల్ గిఫ్ట్ వోచర్స్‌ని మాజిద్ అల్ ఫత్తైమ్ మాల్ దుబాయ్ వ్యాప్తంగా షాపింగ్ ప్రియులకు గెలచుకునే అవకాశం కల్పిస్తున్నారు. డిఎస్ఎఫ్ ఎక్స్‌క్లూజివ్ రివార్డ్స్కి ఇది అదనం. ఇన్ఫినిటి మెగా రఫాలె, ప్రతి రోజూ ఓ కారుని, 150,000 దిర్హామ్‌లు గెలచుకునే అవకాశం కల్పిస్తోంది. దుబాయ్ గోల్డ్ అండ్ జ్యుయెలరీ గ్రూప్ ఒక కిలో బంగారాన్ని గెలచుకునే అవకాశం కల్పిస్తోంది. కమ్యూనిటీ మాల్స్ 1 మిలియన్ దిర్హామ్‌ల విలువైన బహుమతుల్ని వినియోగదారుల కోసం సిద్ధం చేసింది. ఎలక్ట్రానిక్స్, కార్స్‌పై 20 నుంచి 80 శాతం డిస్కౌంట్స్‌ని వీసా డీల్స్ అందించనుంది. తొలి నాలుగు రోజులు అత్యద్భుతమైన ఫైర్ వర్క్స్ సందడి చేస్తాయి. ఆ తర్వాత ప్రతి గురువారం మొత్తం 16 రోజులపాటు ఈ ఫైర్ వర్క్స్ డిస్ప్లే ఉంటుంది.
తాజా వార్తలు
- వైరల్ వీడియోల పై ఒమన్ పోలీసులు దర్యాప్తు.. చట్టపరమైన చర్యలకు సిద్ధం
- ఎన్నిక ఏదైనా కూటమిదే ఘనవిజయం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్ మెరీనాలో 670 మంది కార్మికులకు భద్రత, సామాజిక అవగాహన కార్యక్రమాలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్‌లు విడుదల.. పరిమిత సంఖ్యలో విక్రయాలు
- గల్ఫ్ ప్రవాసులకు ఆన్లైన్లో ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు
- OMCAP ఆధ్వర్యంలో జర్మనీలో ఉద్యోగాలకు 55 మంది ఏపీ నర్సుల ఎంపిక..
- మారిషస్ స్టేట్ హౌస్‌లో డా.గజల్ శ్రీనివాస్ గానం
- తెలంగాణను దేశంలో అగ్రశ్రేణి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి
- ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలకు కొత్త ఊపిరి పోస్తున్న లేపాక్షి
- తెలంగాణ జైళ్ల శాఖకు అరుదైన గౌరవం.. 109వ స్కోచ్ అవార్డు







