సౌదీ అరేబియా అడుగుజాడల్లో యూ. ఏ. ఈ. - చమురుపై ఇక 'నో సబ్సిడీ'

- September 07, 2015 , by Maagulf
సౌదీ అరేబియా   అడుగుజాడల్లో యూ. ఏ. ఈ. - చమురుపై ఇక 'నో సబ్సిడీ'

యూ. ఏ. ఈ. గత నెలలో చమురు సబ్సిడీలను ఎత్తివేసిన మాదిరిగా చేసి ఖజానా కు గండిపడకుండా చూసుకోవాలని సౌదీ ప్రభుత్వం తీవ్ర ఆలోచనలో ఉంది! స్థానికoగా సౌదీలో గాసోలిన్ ధర లీటరుకు 15 సెంట్లు. వెనెజులా తరువాత  ప్రపంచంలోనే అతి తక్కువ అన్న సంగతి తెలిసినదే; ఐతే చమురు ఉత్పత్తుల ధర పెంచడం అనేది అనేక సంవత్సరాల అనంతరం తీసుకున్న ఆర్ధిక సంస్కరణ అని చెప్పవచ్చు. ఈ విధంగా గ్యాస్ ధరలను అత్యంత తక్కువ స్థాయిలో ఉంచేయడం వల్ల ఆర్ధిక నష్టాలు సంభవిస్తాయని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలియవచ్చింది. ఈ విషయంలో చిన్నగా మొదలుపెట్టవలసినదిగా యూ. ఏ. ఈ. అధికారులు సలహా ఇచ్చినట్టు కబురు. ఐతే ఈ ధరల పెంపు, దేశంలో ద్రవ్యోల్బణానికి దారితీసే అవకాశం ఉన్నందువల్ల, ఈ సంస్కరణ అమలుకు ఆచి తూచి అడుగులు వేయాలన్నది ప్రభుత్వ అభిమతం. ఇందుకు అనేక సంవత్సరాలు పడతాయన్న విషయం నిస్సందేహం!

 

--సి.శ్రీ(దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com