బాంబు పేలుతోంది.....
- December 25, 2016
దక్షిణ జర్మనీలోని ఆగ్స్‌బర్గ్ ప్రాంతానికి చెందిన దాదాపు 54 వేల మంది క్రిస్మస్ పండగ కూడా చేసుకోడానికి లేకుండా పొద్దున్నే తమ ఇళ్లు ఖాళీ చేసి వెళ్లాల్సి వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధం నాటి 1.8 టన్నుల బరువున్న ఓ పెద్ద బాంబును నిర్వీర్యం చేయడానికి అధికారులు సిద్ధం కావడమే అందుకు కారణం. నగరంలో ఉన్న మధ్యయుగం ఆనటి కెథడ్రల్, సిటీ హాల్‌లను కూడా ఖాళీ చేయించేశారు. ఉదయం 8 గంటల నుంచే ఖాళీ చేయించడం మొదలుపెట్టి, 10 గంటల కల్లా మొత్తం ఊరిని నిర్మానుష్యం చేసేశారు.
బాంబును పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేమని పోలీసులు అన్నారు. తమ స్నేహితులు లేదా బంధువుల ఇళ్లకు వెళ్లలేనివారి కోసం దూర ప్రాంతాల్లో స్కూళ్లను తెరిచి ఉంచారు.తమతో పాటు పెంపుడు జంతువులను కూడా తీసుకెళ్లిపోవాలని సూచించారు. ఇందుకోసం ఎవరు ఎక్కడికి వెళ్లాలన్నా పైసా చార్జీ కూడా తీసుకోలేదు. జర్మనీలో ప్రపంచ యుద్ధం నాటి బాంబులు బయటపడటం ఇది మొదటిసారి ఏమీ కాదు. ఇంతకుముందు 2011 సంవత్సరంలో కోబ్లెంజ్ నగరంలో ఇలాగే ఒక బాంబు కనపడటంతో అప్పుడు 45 వేల మంది ప్రజలను అక్కడి నుంచి తరలించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో ప్రత్యేక వాహన రిజిస్ట్రేషన్ నంబర్లకు దరఖాస్తులు ఆహ్వానం..!!
- అక్టోబర్ 1 నుంచి ఒమన్‌లో 1,546 వస్తువులపై జీరో వ్యాట్..!!
- ఒమన్ లో కన్జుమర్ కాన్ఫిడెన్స్ సర్వే నిర్వహిస్తున్న ఎన్సీఎస్ఐ..!!
- అల్ షహీద్ పార్క్ మూడో దశ ప్రారంభోత్సవం.. రెండు రోజుల కార్నివాల్..!!
- అక్టోబర్ 21న రియాద్ సీజన్ 2026 ప్రారంభం..!!
- బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ లో ఆకట్టుకున్న పీస్ డే ప్రోగ్రామ్స్..!!
- 48 గంటల్లో ఐరిష్ క్రైమ్ బాస్ అరెస్ట్.. 82 ప్రాపర్టీలు సీజ్..యూఏఈ మంత్రి..!!
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్







