కూతురు పేరు పెట్టిన అర్జున్
- December 25, 2016
అల్లు అర్జున్ స్నేహ దంపతులకు నవంబర్ 21 కార్తీక సోమవారం రోజున పాప పుట్టిన సంగతి విధితమే.. కాగా అల్లు అర్జున్ దంపతులు మొదటి సంతానం అయాన్ ను అభిమానులకు ఎలా పరిచయం చేశాడో.. అదే విధంగా తన ముద్దుల కూతురుని కూడా పరిచయం చేస్తున్నాడు. అయాన్ ను శాంతక్లాజ్, దేశ నాయకులు ఇలా సందర్భాను సారంగా రకరకాల గెటప్స్ ను అయాన్ కు వేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులకు ఆనందాన్ని ఇచ్చాడు.. తాజాగా బన్నీ, స్నేహల కూతురు కు కూడా మా కుటుంబంలో కొత్త ఏంజిల్ వచ్చింది... తన పేరు "అల్లు అర్హ" అని పేరు తో పాటు పాప ఫోటోని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతేకాదు.. అర్హ అంటే హిందువుల ఆరాధ్య దైవం శివ అని.... ఇస్లామిక్ లో ప్రశాంతత మరియు నిర్మలమైన అని అర్ధం అని కూడా పోస్ట్ చేశాడు... ఇంకా Arjun లో మొదటి రెండు అక్షరాలు "AR" ... Sneha లో చివర రెండు అక్షరాలు "HA" లు కలిపి అర్హ అని తమ ముద్దుల కూతురు అల్లు వారి ఇంటి మహాలక్ష్మిని అందరికీ పరిచయం చేశాడు.. అర్హ బుగ్గ మీద చేయివేసి.. నిద్రపోతూ.. అల్లూ వారి వారసురాలు ముద్దులోలికిస్తోంది.
తాజా వార్తలు
- ఖతార్ లో ప్రత్యేక వాహన రిజిస్ట్రేషన్ నంబర్లకు దరఖాస్తులు ఆహ్వానం..!!
- అక్టోబర్ 1 నుంచి ఒమన్‌లో 1,546 వస్తువులపై జీరో వ్యాట్..!!
- ఒమన్ లో కన్జుమర్ కాన్ఫిడెన్స్ సర్వే నిర్వహిస్తున్న ఎన్సీఎస్ఐ..!!
- అల్ షహీద్ పార్క్ మూడో దశ ప్రారంభోత్సవం.. రెండు రోజుల కార్నివాల్..!!
- అక్టోబర్ 21న రియాద్ సీజన్ 2026 ప్రారంభం..!!
- బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ లో ఆకట్టుకున్న పీస్ డే ప్రోగ్రామ్స్..!!
- 48 గంటల్లో ఐరిష్ క్రైమ్ బాస్ అరెస్ట్.. 82 ప్రాపర్టీలు సీజ్..యూఏఈ మంత్రి..!!
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్







