2017 జాయ్ ఆఫ్ లివింగ్: యూఏఈ ప్రెసిడెంట్..
- December 25, 2016
యూఏఈ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, 2017వ సంవత్సరాన్ని 'ఇయర్ ఆఫ్ గివింగ్'గా ప్రకటించారు. సమాజానికి తిరిగివ్వాలనే గొప్ప ఉద్దేశ్యం దీని వెనుక ఉంది. సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తూ, సామాజిక బాధ్యత కింద ప్రైవేట్ సెక్టార్, సేవా కార్యక్రమాలు ప్రారంభించేలా ప్రచారం కల్పించడం ముఖ్యం. ఇది 'ఇయర్ ఆఫ్ 2017'కి సంబంధించి మొదటి పిల్లర్. రెండో పిల్లర్ ఏంటంటే, స్పెషలైజ్డ్ వలంటీర్ ప్రోగ్రామ్స్‌ని నిర్వహించడం ద్వారా సోషల్ డెవలప్‌మెంట్, కమ్యూనిటీ సర్వీసెస్‌ని సులభతరం చేయడం. మూడో పిల్లర్, భవిష్యత్ తరాలు, దేశం పట్ల మరింత అంకిత భావంతో వ్యవహరించేలా వారిలో చైతన్యం పెంచడం. యూఏఈలో ఛారిటీ కార్యక్రమాలపై ఇప్పటికే అవగాహన అభినందించదగ్గ స్థాయిలోనే ఉందని, దాన్ని మరింతగా పెంచవలసిన అవసరం ఉందని షేక్ ఖలీఫా అభిప్రాయపడ్డారు. ఖచ్చితమైన లక్ష్యాలతో పై మూడు విభాగాల్లో పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. 2016వ సంవత్సరాన్ని 'ఇయర్ ఆఫ్ రీడింగ్'గా ప్రకటించి, లక్ష్యాల్ని చేరుకున్నామని, అలాగే 2017వ సంవత్సరం కోసం నిర్దేశించుకున్న లక్ష్యాల్ని చేరుకునే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు షేక్ ఖలీఫా.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







