అయూబ్‌ఖాన్ దుబాయ్‌లో ఉంటూ చక్రం తిప్పాడు!
- December 26, 2016
పోలీసుల కస్టడీలో గ్యాంగ్‌స్టర్ అయూబ్‌ఖాన్! ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌సిటీ: మోస్ట్‌వాటెండ్ గ్యాంగ్‌స్టర్ అయూబ్ ఖాన్(44)ను పోలీసులు పట్టుకున్నారు. రౌడీషీటర్‌గా మొదలైన అతడి ప్రస్థానం అంతర్జాతీయ గోల్డ్ స్మగ్లర్ స్థాయికి చేరింది. కోట్లాదిరూపాయ లున్న గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగాడు. రెండేళ్ల క్రితం దుబాయ్ పారిపోయిన ఇత డిని పట్టుకునేందుకు ఏడాది క్రితం సౌతజోన్ పోలీసులు లుక్‌ఔట్ సర్క్యు లర్ జారీచేశారు. నగరంలోని ఫతేదర్వాజా ప్రాంతానికి చెందిన అయూబ్ ఖాన్‌పై హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 50కి పైగా కేసులున్నాయి. రెండేళ్ల క్రితం ఇతడి ఆగడాలకు చెక్ చెప్పేందకు పీడీ యాక్ట్ నమోదు చేశారు.
చదువు మధ్యలోనే ఆపేసిన అయూబ్‌ఖాన్‌పై 16ఏళ్ల వయసులోనే హుస్సేనిఆలం ప్రాంతంలో దోపిడీకి పాల్పడ్డాడు. అదే ఏడాది ఖాదర్ అనే వ్యక్తిని భూవివాదంలో హత్య చేశాడు. అప్పట్లో జరిగిన ఘర్షణల్లో కీలక సూత్రధారిగా వ్యవహరించాడు. ఇతడిపై హుస్సేనిఆలం పోలీసులు 1991లో హిస్టరీ షీట్ తెరిచారు.
పాతబస్తీలో పోలీసులపై పలు మార్లు దాడికి ప్రయత్నించాడు. 1992లో పోలీసులపై దాడికి పాల్పడే సమ యంలో పోలీసులు అతడిపై కాల్పులు జరపడంతో కాలికి బుల్లెట్ గాయ మైంది. అయినా పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నాడు. పాతబస్తీలోని రౌడీషీటర్స్, నేరస్తులతో కలపి గ్యాంగ్ తయారు చేశాడు.
కిడ్నాప్‌లు, సెటిల్‌మెంట్స్, ప్రైవేటు పంచాయతీలతో హల్‌చల్ చేశాడు. 2002లో అడ్వ కేట్ మన్నన్‌ఘోరీ హత్యకేసులో ప్రధాన నిందితుడు. ఆ కేసులో అరెస్టయి మూడేళ్లపాటు విశాఖపట్టణం జైల్లో ఉన్నాడు. 2005 ఫిబ్రవరిలో జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చాడు.
ఆతరువాత కూడా నగరంలో జరి గిన రెండునేరాల్లో అతడిపై కేసులు నమోదయ్యాయి. అనంతరం పోలీసుల కన్నుగప్పి తప్పించుకు తిరిగాడు. కర్ణాటకలోని గుల్బర్గాలో కొంతకాలం దల దాచుకున్నాడు. కర్ణాటక, చెన్నై, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ఉంటూ హైద రాబాద్‌లోని తన అనుచరులతో సెటిల్‌మెంట్స్ జరిపేవాడు.
గల్ప్‌దేశాల నుంచి అక్రమంగా చేరే విదేశీ కరెన్సీ, బంగారం తరలిస్తూ స్మగ్లర్‌గా మారా డు. అడ్వకేట్ హత్యకేసులో సాక్షులను అడ్డుతొలగించేందుకు ప్రయత్నిం చినట్లు గుర్తించిన పోలీసులు వారికి భద్రతను పెంచారు. ఏపీ, కర్ణాటకల్లో రెండుసార్లు చిక్కినట్లే చిక్కి చాకచక్యంగా తప్పించుకున్నట్లు సమాచారం. దీంతో 2015లో సౌతజోన్ పోలీసులు అయూబ్‌ఖాన్‌ను పట్టుకునేందుకు లుక్-అవుట్-నోటీస్ జారీచేశారు.
ప్రస్తుతం కరడుగట్టిన రౌడీషీటర్‌పై 30కి పైగా పెండింగ్ కేసులున్నాయి. ముంబై పోలీసుల సాయంతో ఆదివారం రాత్రి ముంబై విమానాశ్రయంలో అయూబ్‌ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నుంచి సోమవారం విమానం ద్వారా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తీసుకువచ్చారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య అతడిని పోలీసు అధికారి కార్యాలయానికి తరలించినట్లు సమాచారం.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









