రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్‌టీసీ..
- December 26, 2016
ఇంతవరకు కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఉన్న దేశంలో ఎక్కడికైనా ప్రభుత్వ ఖర్చుతో ప్రయాణించే ఎల్‌టీసీ సదుపాయాన్ని రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు వర్తింపజేశారు. ఇకపై వీరు కూడా దేశంలో ఎక్కడికైనా లీవ్ ట్రావెల్ కన్సెషన్ (ఎల్‌టీసీ)పై ప్రయాణించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు కూడా తాము పనిచేసే ప్రాంతం నుంచి దేశంలో ఏ ప్రాంతానికైనా ప్రభుత్వ ఖర్చుతో ప్రయాణించే అవకాశం ఉంది. దేశంలో వివిధ ప్రాంతాలకు వెళ్లడానికి తమ సర్వీసులో ఈ విధమైన సదుపాయాన్ని ఒకసారి మాత్రం వినియోగించుకోవచ్చు. హోమ్ టౌన్ విధానంలో నాలుగు సంవత్సరాలకు ఒకసారి తమ రాష్ట్రంలో సొంత ప్రాంతాలకు వెళ్లే అవకాశాన్ని కూడా కల్పించారు.
ఇందుకోసం అయ్యే చార్జీలను కూడా ప్రభుత్వం భరిస్తుంది. ఈ మేరకు 98 నంబర్ గల ఉత్తర్వులు అమల్లో ఉన్నాయి. వెళ్లి రావడానికి 3,500 కిలోమీటర్లు మించకూడదు. ఇందుకు గాను చార్జీలుగా రూ.12,500 చెల్లిస్తారు.
అదనంగా అయ్యే ఖర్చులను ఉద్యోగులు సొంతంగా భరించవలసి ఉంటుంది. ఎల్‌టీసీపై వెళుతున్న సమయంలో ముందుగా తాము పనిచేస్తున్న యాజమాన్యానికి, విభాగాధిపతికి తెలియజేయాలి. ఎల్‌టీసీ వినియోగించేవారు సెలవుల్లో వెళితే ఫర్వాలేదు లేదా ప్రత్యేక సెలవులు పెట్టుకోవాలి. తిరిగి వచ్చిన తర్వాత బస్సు, రైలు చార్జీల బిల్లులను ట్రెజరీ కార్యాలయానికి సమర్పించాలి.
వీటికి సంబంధించి కంటింజెంటు బిల్లుని కూడా జత చేయాలి. పరిమితికి లోబడి నగదు ఉద్యోగి ఖాతాలో జమ అవుతుంది.
తాజా వార్తలు
- ఒమన్‌లో అక్టోబర్ 11 నుంచి యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!
- విద్యాశాఖ ఆధ్వర్యంలో ‘SACT’ కాంపిటీషన్ ప్రారంభం..!!
- సహల్ యాప్‌లో ప్రభుత్వ శాఖలకు నేరుగా ఫిర్యాదులు..!!
- యూఏఈలో భారీగా క్రిస్టల్ మెత్ పట్టివేత..!!
- రిజిస్ట్రేషన్ లేని పెప్టైడ్ల విక్రయంపై సౌదీ కఠిన చర్యలు..!!
- బహ్రెయిన్‌లో ఐదుగురు ఆసియా దేశస్థులు అరెస్ట్..!!
- దుబాయ్–టెల్ అవీవ్ ఫ్లై దుబాయ్ విమానంలో ఘటన
- భారత్–ఖతార్ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- పోలీసింగ్‌లో నాయకత్వం ఎంతో కీలకం: తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్
- సిరిసిల్లలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం: సీఎం రేవంత్







