ఇంధనం అయిపోవడంతోనే కొలంబియా విమాన ప్రమాదం..
- December 26, 2016
గత నెల 29వ తేదీన కొలంబియాలో జరిగిన విమాన ప్రమాదంలో 71 మంది మృతి చెందారు. మృతిచెందిన వారిలో 19 మంది బ్రెజిల్‌కు చెందిన చెపకొయిన్స్ ఫుట్‌బాల్ క్లబ్ క్రీడాకారులు, సిబ్బంది ఉన్నారు. ఈ విమాన ప్రమాదంపై జరిపిన విచారణలో.. ఇంధనం అయిపోవడం మూలంగానే ప్రమాదం జరిగిందని కొలంబియన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ అధికారులు గుర్తించారు.
విమానం మెడిలిన్స్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునే సమయంలో సమీపంలోని కొండల్లో కూలిపోయింది. ప్రాధమిక దర్యాప్తులో ఇంధనం అయిపోవడంతో పాటు.. విమానం నిర్ధేశించిన దానికన్నా ఓ 500 కిలోలు ఎక్కువ బరువుతో వెళ్తున్నట్లుగా కూడా గుర్తించామని అధికారులు మీడియా సమావేశంలో వెల్లడించారు.
ప్రమాదంలో మృతి చెందిన విమాన పైలట్ మిగుయల్ కైరోగా.. ఎమర్జెన్సీ ప్రకటించడానికి ఎక్కువ సమయం తీసుకున్నాడని ఎయిర్‌లైన్స్ సెక్యూరిటీ సెక్రెటరీ ఫ్రెడ్డీ బొనిల్లా తెలిపారు. కూలిపోవడానికి కేవలం రెండు నిమిషాల ముందే విమానం పూర్తిగా ఫెయిల్ అయిన విషయాన్ని పైలట్ రిపోర్ట్ చేశాడని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









