రన్‌వేపై జారిపడిన విమానం..

- December 26, 2016 , by Maagulf
రన్‌వేపై జారిపడిన విమానం..

గోవాలోని డబోలిన్‌ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం ఉదయం రన్‌వేపై టేకాఫ్‌ సమయంలో జెట్‌ ఎయిర్‌వేస్‌ 9 W 2374 విమానం ఒక్కసారిగా జారిపోయి పక్కకు ఒరిగిపోయింది. ఆ సమయంలో విమానంలో ఏడుగురు సిబ్బంది సహా 154 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం కుదుపులకు ఏడుగురు గాయపడగా... ప్రయాణికులను తరలిస్తున్న సమయంలో మరో 15 మంది గాయపడ్డారు. ఈ విమానం గోవా నుంచి ముంబయి వెళ్తొంది. ఈ ఘటనతో డబోలిన్‌ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. . 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com