తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో బతుకమ్మ వైభవం..
- December 26, 2016
సుమారు 150మంది బాలకళాకారులచే నిర్వహించబడిన బతుకమ్మ వైభవం నృత్యప్రదర్శన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. సోమవారం రవీంద్రభారతిలో బతుకమ్మ నృత్యమండలి, భాషా సాంస్కృతికశాఖ సంయుక్త ఆధ్వర్యంలో బతుకమ్మ వైభవం శీర్షికన నృత్యప్రదర్శన జరిగింది. నృత్యగురువు కల్లూరి వెంకటేశ్వర్లు, కల్లూరి నాగమణి, కిరణ్మయి, భవానీ, కిశోర్ తదితరుల ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రదర్శనలో చిన్నారులు అద్భుతంగా నర్తించి భళా అనిపించారు. తెలుగు బుక్ ఆఫ్రికార్డ్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు చింతపట్ల వెంకటాచారి హాజరై తిలకించిన అనంతరం తెలుగు బుక్ ఆఫ్‌రికార్డులో చోటు సంపాదించినట్లు ప్రకటించారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు హాజరై విద్యార్థులను అభినందించారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో అక్టోబర్ 11 నుంచి యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!
- విద్యాశాఖ ఆధ్వర్యంలో ‘SACT’ కాంపిటీషన్ ప్రారంభం..!!
- సహల్ యాప్‌లో ప్రభుత్వ శాఖలకు నేరుగా ఫిర్యాదులు..!!
- యూఏఈలో భారీగా క్రిస్టల్ మెత్ పట్టివేత..!!
- రిజిస్ట్రేషన్ లేని పెప్టైడ్ల విక్రయంపై సౌదీ కఠిన చర్యలు..!!
- బహ్రెయిన్‌లో ఐదుగురు ఆసియా దేశస్థులు అరెస్ట్..!!
- దుబాయ్–టెల్ అవీవ్ ఫ్లై దుబాయ్ విమానంలో ఘటన
- భారత్–ఖతార్ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- పోలీసింగ్‌లో నాయకత్వం ఎంతో కీలకం: తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్
- సిరిసిల్లలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం: సీఎం రేవంత్







