పెరల్ హార్బర్‌ను సందర్శించనున్న జపాన్ ప్రధాని..
- December 26, 2016
జపాన్ ప్రధాని షింజో అబే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో కలిసి పెరల్ హార్బర్‌ను సందర్శించనున్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో పెరల్ హార్బర్‌పై జపాన్ దాడిని అతిపెద్ద మలుపుగా పేర్కొంటారు. ఈ ఘటనతో అమెరికా 2300 సైనికులను నష్టపోయింది. దీంతో అమెరికా యుద్ధ రంగంలోకి దిగి జపాన్‌పై అణుదాడి చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో అబే పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. సందర్శనలో భాగంగా అబే మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తారు కానీ ఎటువంటి క్షమాపణలు చెప్పరని జపాన్ అధికార వర్గాలు తెలిపాయి. అనంతరం హవాయిలోని జరిగే సమావేశంలో ఒబామాతో కలిసి పాల్గొంటారు. పెరల్ హార్బర్ ఘటన జరిగి 75 సంవత్సరాలు పూర్తైన తర్వాత మూడు వారాలకు అబే అమెరికాను సందర్శిస్తున్నారు.
తాజా వార్తలు
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!
- యూఏఈ–భారత్ సాంస్కృతిక సహకారానికి మరింత బలోపేతం







