దోహాలో సమస్యాత్మకంగా అక్రమ పార్కింగ్..
- December 27, 2016దోహాలో అక్రమ పార్కింగ్‌తో సమస్యలు తీవ్రమవుతున్నాయి. పార్కింగ్ కోసం వాహనదారులు తీవ్రమైన సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. 'ప్రైవేట్ పార్కింగ్' పేరుతోనూ, 'నో పార్కింగ్' పేరుతోనూ బోర్డులు వాహనదారులకు సమస్యల్ని తెచ్చిపెడుతున్నాయి. కొంతమంది పార్కింగ్ ఫీజుల్ని వాహనదారుల నుంచి వసూలు చేస్తుండగా, వాహనదారులు నో పార్కింగ్‌లో తమ వాహనాల్ని పార్కింగ్ చేసినట్లు ఆ తర్వాత గుర్తిస్తున్నారు. వాహనాలకు 'నో పార్కింగ్ జోన్, ఇంకోసారి ఇలాంటి తప్పిదానికి పాల్పడొద్దు' అనే హెచ్చరికలతో కూడిన స్లిప్స్ ట్రాఫిక్ పోలీసుల నుంచి కనిపిస్తుండడంతో షాక్‌కి గురవ్వాల్సి వస్తోందని వాహనదారులు అంటున్నారు. చాలా సందర్భాల్లో షాపుల యజమానులు, తమ షాప్ ముందరి స్థలాల్ని పార్కింగ్ కోసం కేటాయించడం జరుగుతోంది. ఇలాంటి సందర్భాల్లో వాహనదారులు తెలియక సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. అధికారిక అనుమతులు లేకుండా పార్కింగ్ స్లాట్స్‌ని మెయిన్‌టెయిన్ చేస్తే అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకోబడ్తాయని ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ - మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరిస్తోంది.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







