2000 మంది విమాన ప్రయాణీకులపై 'పొగమంచు' ఎఫెక్ట్ ..
- December 28, 2016
బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రన్‌వే ఆకస్మిక మూసివేత కారణంగా 2000 మంది ప్రయాణీకులు ఇబ్బంది పడ్డారు. భారీగా కమ్ముకున్న పొగమంచు కారణంగా రన్‌వేని మూసివేయాల్సి వచ్చింది. బహ్రెయిన్ ఎయిర్పోర్ట్ కంపెనీ ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. లో విజిబిలిటీ కారణంగా బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 21:20 (26 డిసెంబర్) నుంచి 04.30 (27 డిసెంబర్) గంటల వరకు విమాన రాకపోకల్ని నిలిపివేశామనీ, కొన్నిటిని ఇతర ఎయిర్‌పోర్టులకు మళ్ళించామని బహ్రెయిన్ ఎయిర్పోర్ట్ కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ కారణంగా 2000 మంది ప్రయాణీకులపై ప్రభావం పడినట్లు అధికారులు పేర్కొన్నారు. 5 గంటల తర్వాత విమాన రాకపోకలు యదాథంగా కొనసాగాయనీ, ప్రయాణీకులు తమ విమానాల రీషెడ్యూల్‌పై సంబంధిత ఎయిర్‌లైన్స్‌తో టచ్‌లో ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







