ఖుష్బూ పవన్ సినిమాలో!
- December 28, 2016
ఒకప్పుడు తన అందచందాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన కుష్బూ తర్వాత తెలుగు తెరకు పూర్తిగా దూరమైంది. చాలాకాలం తర్వాత మురుగన్‌దాస్-చిరంజీవి కలయికలో వచ్చిన 'స్టాలిన్' చిత్రంలో కనిపించింది. తొమ్మిదేళ్ల తర్వాత చిరంజీవి సోదరుడు పవన్ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కనున్న తాజా చిత్రంలో కుష్బూ ముఖ్య పాత్ర పోషించనుంది. ఈ విషయాన్ని కుష్బూ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత తెలుగు సినిమాలో నటిస్తున్నా.
త్రివిక్రమ్-పవన్ కాంబినేషన్లో వస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో పాలుపంచుకుంటున్నా. త్రివిక్రమ్ బ్రిలియంట్ స్క్రిప్టు సిద్ధం చేశారు. చాలా పవర్‌ఫుల్ క్యారెక్టర్. నా గత చిత్రం మెగాస్టార్ చిరంజీవితో చేశా. ఇప్పుడు ఆయన తమ్ముడు సినిమాతో మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నా. సంతోషంగా ఉంది. సినిమాల్లో మళ్లీ నటించాలని నిర్ణయం తీసుకోవడానికి చాలా కాలం పట్టింది. తెలుగులో నటించేందుకు తొమ్మిదేళ్లు, తమిళ సినిమా చేయడానికి ఏడేళ్లు పట్టింది. ఇకపై నా అభిమానులకు నిరుత్సాహపరచని పాత్రలే ఎంచుకుంటా' అని ఖుష్బూ ట్వీట్ చేశారు.
ఈ చిత్రంలో పవన్ సరసన కీర్తీసురేశ్ నటిస్తోంది. అనిరుధ్ స్వరాలు సమకూరుస్తున్నారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక
- సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆర్టీసీ బస్ పాసులు..పరిశీలనలో ప్రభుత్వం!
- సైన్ బోర్డు పై హిందీ పదాలు..ఇద్దరు ఇంజనీర్లను సస్పెండ్ చేసిన తమిళనాడు ప్రభుత్వం!
- దేశ నిర్మాణంలో నిర్మల సీతారామన్ కీలక పాత్ర.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
- భారతి మాతాజీ అస్తమయం
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్‌లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!







