సెన్సార్ పనులు పూర్తిచేసుకున్న 'ఖైదీనంబర్ 150'
- December 29, 2016
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం 'ఖైదీనంబర్ 150'. గురువారం ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ సభ్యులు 'యు/ఏ' సర్టిఫికెట్ జారీ చేశారు. దాదాపు తొమ్మిదేళ్ల విరామం అనంతరం చిరంజీవి వెండితెరపై కన్పిస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లోనే కాదు ఇటు చిత్ర పరిశ్రమలోనూ ఆసక్తి నెలకొంది. ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తుండగా, చిరు సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రాంచరణ్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- నాటక రంగానికి పూర్వవైభవం:సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్ స్కూళ్లలో ఫొటోలు, వీడియోలపై కొత్త నిబంధనలు..!!
- బిట్స్ పిలానీ–ఐఐటీ మద్రాస్ మధ్య ఐదేళ్ల భాగస్వామ్యం.. విద్యార్థుల ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్
- సీఐఐ అవార్డ్స్‌లో జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ఎనిమిదోసారి ‘ఎనర్జీ లీడర్’ గౌరవం
- చిన్న వ్యాపారులకు గుడ్‌న్యూస్..
- ఇండిగో ప్రయాణికులకు షాక్..విమాన ఇంధన ఛార్జీలు పెంపు
- ‘అమరజీవి జలధార’ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- తెలంగాణ: 13 రోజులు స్కూళ్లకు, కాలేజీలకు దసరా సెలవులు..
- కామాంధుల్లో చావు భయం కలగాలి.. పోలీసులకు సుప్రీం ఆదేశం
- బహ్రెయిన్–మలేషియా ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!







