షార్జాలో లేడీస్ రూంలోకి తొంగి చూసి కాలు జారి మృతిచెందిన భారత యువకుడు
- December 29, 2016
ఓ భారతీయ యువకుడు ఓ ఎత్తైన భవనంలోని లేడీస్ రూంలోకి తొంగి చూశాడు. అక్కడి నుంచి కిందపడి మృతి చెందాడు. ఈ విషాద సంఘటన యూఏఈలోని షార్జాలో జరిగింది. అతను 28 ఏళ్ల భారతీయ యువకుడిగా గుర్తించారు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆ యువకుడి మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం మేరకు.. పక్కనే ఉన్న భవనంలోని ఓ గదిలో అమ్మాయిలు నివసిస్తున్నారు. వారిని చూసేందుకు తొంగి చూశాడు. కానీ అంత ఎత్తైన బిల్డింగ్ నుంచి అతను బ్యాలెన్స్ తప్పి, కింద పడిపోవడంతో చనిపోయాడు. ఈ సంఘటన షార్జా ఇండస్ట్రియల్ ఏరియా నెంబర్ 8లో చోటు చేసుకుంది. అది చూసిన స్థానికులు పోలీసులకు ఫోన్ చేశారు. విషయం తెలియగానే వారు అక్కడకు చేరుకున్నారు. పోలీసులు అతని వేలిముద్రలు సేకరించారు.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- సౌదీలో ఐస్‌క్రీమ్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- కువైట్ ఫ్రైడే మార్కెట్లో తనిఖీలు.. 61 మంది అరెస్ట్..!!
- మలేషియాలో వర్షంలోనూ అదరగొట్టిన గల్ఫ్ ఎయిర్ ఫ్లైపాస్ట్..!!
- ఖతార్‌లో పిల్లల డిజిటల్ భద్రతపై ప్రత్యేక దృష్టి..!!
- మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకానికి ఆడపడచుల నీరాజనాలు
- కజకిస్థాన్‌కు బయలుదేరిన ఒమన్ సుల్తాన్..!!
- నాటక రంగానికి పూర్వవైభవం:సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్ స్కూళ్లలో ఫొటోలు, వీడియోలపై కొత్త నిబంధనలు..!!
- బిట్స్ పిలానీ–ఐఐటీ మద్రాస్ మధ్య ఐదేళ్ల భాగస్వామ్యం.. విద్యార్థుల ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్







