డిజిటల్ చెల్లింపులకు త్వరలో రానున్న హెల్ప్ లైన్ నెంబర్
- December 29, 2016
డిజిటల్ చెల్లింపులు ఎలా అని తల పట్టుకుంటున్నవారికో శుభవార్త. వారికోసమే అన్నట్టు 14444 అనే హెల్ప్ లైన్ నెంబర్ వస్తోంది. మన ప్రశ్నలన్నిటికీ ఈ నెంబర్ ద్వారా పరిష్కారం కనుక్కోవచ్చు. దేశంలో నోట్ల రద్దు తర్వాత డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహింహేందుకు ప్రభుత్వం ఈ చర్య తీసుకోనుందని ఏపీ సీ ఎం చంద్రబాబు తెలిపారు. ఈ నెంబరు ద్వారా ప్రజలు తమ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చునన్నారు. డిజిటల్ చెల్లింపులపై ఢిల్లీ లో జరిగిన మఖ్యమంత్రుల కమిటీ సమావేశం తరువాత మాట్లాడిన ఆయన.. దేశ వ్యాప్తంగా నగదు రహిత చెల్లింపులకువీలుగా 10 లక్షల పీ ఓ ఎస్ మెషిన్లను దిగుమతి చేసుకునే యోచన ఉందన్నారు.(ఈ కమిటీకి బాబు చైర్మన్ గా ఉన్న సంగతి తెలిసిందే).
యూజర్లకు,స్మార్ట్ ఫోన్లకోసం సబ్సిడీ ఇచ్చే ఆలోచన కూడా ఉందని, తమ కమిటీ వారంలో గా ఓ మధ్యంతర నివేదికను ప్రధాని మోదీకి సమర్పిస్తుందని ఆయన చెప్పారు. కాగా నాస్కామ్, టెలిఫోన్ ఆపరేటర్లు, ప్రభుత్వ మేధావులు, నిపుణులు కలిసి ఈ హెల్ప్ నెంబర్ క్రియేషన్ విషయంలో కృషి చేయనున్నారని నీతి ఆయోగ్ వైస్-చైర్మన్ అరవింద్ పనగారియా తెలిపారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









