APNRT కో-ఆర్డినేటర్ రఘునాధ బాబు వడ్లమూడి(బహ్రెయిన్) తో ముఖాముఖి
- December 30, 2016
Q: ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ కో-ఆర్డినేటర్లుగా మీ బాధ్యత ఏమిటి?
A: ఎన్నార్టికి స్థానిక ప్రమేయం కల్పించటం, .. చురుకుగా ఎన్నార్టికి సభ్యత్వ ప్రచారం చేయడం, ఎన్నార్టి లక్ష్యాలు మరియు సేవల వివరాలు తెలియ చేయడం ... స్వచ్ఛంద దాతలను గుర్తించి, ఇన్వెస్ట్మెంట్ అవకాశాలు కల్పించటం తదితరములు ముఖ్య బాధ్యతులు గా తలుస్తున్నాను.
Q: ఆంధ్రప్రదేశ్‌తో విదేశాల్లోని తెలుగువారిని కలిపేందుకు ముందుకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం పట్ల మీ స్పందన ఏమిటి?
A: విదేశాల లోని తెలుగు వారిని కలపి, తెలుగు గడ్డపై వాళ్ళ భాధ్యతను గుర్తు చేయించే సంస్థను ప్రోత్సహిస్తున్న గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అభినందనీయులు. గౌరవనీయులు శ్రీ NTR గారు వేసిన స్ఫూర్తిని/ పునాదిని శ్రీ చంద్ర బాబు గారు NRT రూపములో అందించారు.
Q: మాతృభూమికి ఎంతో కొంత చేయాలన్న సంకల్పం చాలా గొప్పది, ఈ సంకల్పాన్ని విదేశాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కి చెందినవారెలా భావిస్తున్నారు?
A: మాతృ భూమికి సేవ చేయాలనే సంకల్పము ప్రతి ఒక్కరికి ఉంది. ఈ సేవ చేసే సదుపాయాన్ని ఎన్నార్టి కలుగ చేస్తుందని అందరూ ఆశిస్తున్నారు.
Q: కొత్త రాష్ట్రం, కోటి సమస్యలతో ఏర్పడ్డ రాష్ట్రానికి ఎన్‌ఆర్‌ఐల తోడ్పాటు ఎలా ఉంటే బావుంటుందనుకుంటున్నారు?
A: సమస్యల నుంచే పరిష్కార మార్గములు, పురోభివ్రుధి అవకాశములు పుట్టుకొస్తాయి. ఎన్ఆర్ఐలు తమ తమ నైపుణ్యాన్ని ప్రతేకతను తమ మాతృభూమికి ఉపయోగ పడే మార్గములను ఎన్నార్టి ముందుంచి సమస్యల పరిష్కార మార్గ దర్సకులుగా ఉంటే క్రొత్త రాష్ట్రమునకు ఎంతో సేవ చేసిన వారగుదురు.
Q: ఇప్పటిదాకా ఎప్పుడూ ఎక్కడా లేని కొత్త విధానం, కొత్త ఆలోచన ఇది. ఈ ఆలోచన విదేశాల్లో ఉన్న వారిగా మీకెలా అనిపిస్తోంది?
A: ఈ గొప్ప ఆలోచనను ప్రవేశ పెట్టిన గౌరవనీయ ముఖ్య మంత్రి గారు మరియు ఈ ఆలోచనకు ఒక కార్య రూపమిచ్చిన డాక్టర్ రవి గారు అభివందనీయులు. ఇదే ఒక సదావకాశముగా గుర్తించి ఈ కార్య క్రమాన్ని జయప్రదం చేయాలనే ప్రఘాడ అనుభూతి మాలో కలిగింది.
Q: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీకు ఈ విషయంలో అందించే సహాయ సహకారాలు ఎలా ఉంటున్నాయి?
A: ప్రభుత్వము అందించ గల సహాయ సహకారములు అనేక రూపాలలో ఉన్నాయి. ప్రస్తుతానికి స్పందనైతే బాగానే ఉంది కానీ ఇంకా కార్య రూపముని దాల్చా వలసి ఉంది. కార్య రూపము కూడా అద్భుతముగానే ఉంటుందని ఆశిస్తున్నాము.
Q: మాతృభూమికి సేవ చేయడం ఓ గొప్ప అవకాశం. ఆ అవకాశం కల్పించిన ప్రభుత్వానికి మీ తరఫున ఎలా కృతజ్ఞత తెలుపుతారు?
A: మాతృ భూమి కి ఈ విధముగా సేవ చేసే మహా భాగ్యాన్ని కలిపించిన గౌరవనీయ ముఖ్య మంత్రి గారికి మా హృదయ పూర్వక కృతజ్ఞతలు. మా వంతు సేవను గత 10 సంవత్సరములుగా మా గ్రామమునకు అంద చేస్తున్నాము. ఈ సేవలను అధిగమించే రీతిలో మరియు మరింత ఎక్కువ గా సహాయ సహకారములు అందించ గల సామర్ధ్యం సమకూర్చి ఈ క్రొత్త ఎన్నార్టి పధకములు మరింత పురోభి వృద్ధికి దోహదం చేస్తాయని ఆశిస్తాము.
Q: ప్రభుత్వ ఆలోచనల్ని విదేశాల్లో ఉన్న ఎన్‌ఆర్‌ఐల వద్దకు తీసుకెళ్ళడానికి మీరు చేపట్టే ప్రత్యేక కార్యక్రమాల వివరాలు?
A: ఇక్కడి తెలుగు వారినందరిని ఒక సామూహికసంస్థ గా చేర్చి, అందరికి ఈ సభ్యతములో గల సదావకాశములను తెలియ చేసే ప్రయత్నములో ఉన్నాము. గవర్నమెంట్ ఎన్నారైల కోసం తీసుకొచ్చే ప్రత్యేక పథకాలను తెలియచేసే ఒక వెబ్ పోర్టల్ తయారు చేసి తద్వారా ఎన్నారైలను తమ తమ గ్రామ, పట్టణాభి వృద్ధిలో భాగస్వాములగుటానికి ప్రోత్సచించే ప్రణాళికలు అందించే ప్రయత్నములో ఉన్నాము.
తాజా వార్తలు
- లండన్ లో అంగరంగ వైభవంగా శక పురుషుని శత జయంతి వేడుకలు
- ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..
- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల్లో ఉద్యోగాలు...
- ICBF ఆధ్వర్యంలో వైభవంగా ‘లేబర్ డే రంగ్ తరంగ్ 2023’
- ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికుడికి గుండెపోటు..కాపాడిన వైద్యుడు..!
- మస్కట్‌లో 49 మంది మహిళా కార్మికులు అరెస్ట్..!
- వ్యభిచార రింగ్ నడిపిన మహిళలకు 10 ఏళ్ల జైలుశిక్ష
- ఈ వేసవిలో ఎయిర్‌పోర్టుల్లో రద్దీ.. నివారణకు 6 మార్గాలు..!
- Dhs1.6b హౌసింగ్ లోన్‌ను ఆమోదించిన షేక్ మహమ్మద్.. 2వేల మందికి లబ్ధి
- హజ్ కోసం 22,000 మంది నియామకం