సెర్చ్ అండ్ ఫాలో అప్ డిపార్ట్మెంట్లో కొత్త సౌకర్యం
- December 30, 2016
డిపార్ట్మెంట్ ఆఫ్ బోర్డర్, పాస్‌పోర్ట్ మరియు ఎక్స్పాట్రియేట్ ఎఫైర్స్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ మొహమ్మద్ అహ్మద్ అల్ అతిక్, విమెన్స్ రిసెప్షన్ / వెయిటింగ్ ఏరియాకి సంబంధించి కొత్త ప్రెమిసిస్ని ప్రారంభించారు. ఇందులో ఫింగర్‌ప్రింట్ మరియు కేస్ స్టడీ సెక్షన్లను ఇక్కడ ప్రారంభించడం జరిగింది. తమ శాఖ కంటిన్యువస్ డెవలప్‌మెంట్‌ని ప్రదర్శిస్తోందనీ, భవనాల విస్తరణ, కొత్త సౌకర్యాలను సంతరించుకుంటోందని బ్రిగేడియర్ అల్ అతిక్ చెప్పారు. రెసిడెన్సీ చట్టాన్ని అతిక్రమించిన వలసదారులకు సంబంధించి, వారి అభ్యర్థనల్ని స్వీకరించడం, 48 గంటల్లో వారిని స్వదేశానికి పంపించడం వంటి చర్యల్ని ఈ డిపార్ట్మెంట్ చేపడుతోంది. డిపార్ట్మెంట్ పరిసరాలు పూర్తిగా కొత్తగా మార్చబడ్డాయి. బెడ్స్, డైనింగ్ హాల్స్, మాస్క్‌లు, ఎంటర్టైన్మెంట్ జోన్స్, క్లినిక్స్ ఇతర సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. డిపార్ట్మెంట్ కొత్త కమర్షియల్ కాంప్లెక్స్‌ని కూడా ప్రారంభించింది. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్, ఇతర ఎస్సెన్షియల్ కమోడిటీస్, గార్మెంట్స్ వంటివి ఇన్‌మేట్స్ కోసం అందుబాటులో ఉంచుతున్నారు. తమవారితో టెలిఫోన్ సంభాషణ కోసం కూడా ఏర్పాట్లు చేశారు. ప్రారంభోత్సవంలో బ్రిగేడియర్ అబ్దుల్లా జబెల్ అల్ లబ్దా (మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ - సెర్చ్ అండ్ ఫాలో అప్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్) కూడా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







