అక్రమ ప్రవేశం : ముగ్గురికి జైలు
- December 30, 2016
మనామా: జిసిసి జాతీయులు ముగ్గురు అక్రమంగా దేశంలోకి ప్రవేశించినందుకుగాను మూడేళ్ళ జైలు శిక్షకు గురయ్యారు. అందులో ఒకరికి స్వదేశంలో ఏడాది జైలు శిక్ష ఉంది. అతనిలాగే ఉండే మరో వ్యక్తికి చెందిన డాక్యుమెంట్లతో మరో ఇద్దరు వ్యక్తులు అతన్ని దేశంలోకి తీసుకువచ్చారు. దీనికి సంబంధించి సమాచారం అందుకోగానే, పోలీసులు వారు బస చేసిన హోటల్ రూమ్‌లో తనిఖీలు నిర్వహించి, నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో మరో వ్యక్తి కూడా అక్కడే ఉన్నా, అతని తరఫున ఎలాంటి తప్పిదం జరగకపోవడంతో అతన్ని విడిచిపెట్టారు. ఈ కేసులో తొలి నిందితుడు ఫోర్జరీ కేసులోనూ బుక్కయ్యాడు. మరో ఇద్దరు, అతనికి సహాయ పడ్డ కేసులో శిక్షకు గురయ్యారు. జైలు శిక్ష పూర్తయ్యాక ఈ ముగ్గుర్నీ దేశం నుంచి పంపేస్తారు.
తాజా వార్తలు
- దుబాయ్లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!







