బంగారం అక్రమ రవాణా...పట్టుకున్న కస్టమ్స్ అధికారులు..
- December 30, 2016
లో దుస్తుల్లో పెట్టుకొని బంగారం అక్రమ రవాణా చేస్తుండగా విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్న సంఘటన శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వెలుగుచూసింది. 1.25 కిలోల బంగారు బిస్కెట్లను కస్టమ్స్, ఎయిర్ ఇంటలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు. పాతనగరంలోని రెయిన్ బజార్ కుచెందిన అమేర్, ఫహద్, ఫసియుద్దీన్ లు స్నేహితులు. మూడునెలల క్రితం ఫహద్, ఫసీయుద్దీన్లు సౌదీకి వెళ్లారు.అమేర్ హైదరాబాద్ లో ఉండేవాడు. అమేర్ కూడా సౌదీకి వెళ్లి మరో ఇద్దరితో కలిసి వస్తూ అమేర్ బంగారం బిస్కెట్లు తీసుకువస్తూ అధికారులకు దొరికాడు. శుక్రవారం జెడ్డా విమానం దిగి ఎయిర్‌పోర్టు వెలుపలి కి వస్తున్న ప్రయాణికులను తనిఖీ చేయగా అమేర్ వద్ద ఒక కిలో 435 గ్రాముల బంగారం దొరికింది.
తన లోదుస్తు ల్లో బంగారం దాచుకొని తెస్తుండగా సోదాల్లో లభించిందని అధికారులు చెప్పారు. బంగారం స్వాధీనం చేసుకొని నింధితుడిని అదుపులోకి తీసుకున్నారని సమాచారం. జెడ్డా దేశం నుంచి వస్తున్న విమానం లో కొందరు ప్రయాణికులు దొంగచాటుగా బంగారం తెస్తున్నట్టు సమాచా రం అందడంతో కస్టమ్స్ అధికారులు, ఎయిర్ ఇంటలిజెన్స్ అధికారులు సంయుక్తంగా ఎయిర్‌పోర్టులో మాటువేసి నిందితులను పట్టుకున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







