జాగృతి క్రికెట్ కప్ 7 నుంచి..
- December 30, 2016
తెలంగాణ జాగృతి క్రికెట్ కప్ వచ్చే నెల 7 నుంచి 23వ తేదీ వరకు జరుగనుంది. గ్రామీణ క్రీడాకారుల నైపుణ్యానికి మెరుగులు దిద్దడమే లక్ష్యంగా ఈ టోర్నీని నిర్వహిస్తున్నట్లు జాగృతి నేతలు తెలిపారు. టోర్నీలో విజేతకు అందజేసే ట్రోఫీని నిజామాబాద్ ఎంపీ కల్వ కుంట్ల కవిత శుక్రవారం ఆవిష్కరించారు. పాత పది జిల్లాలను జోన్లుగా విభజించి ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. ఒక్కో జోన్ నుంచి 24 జట్ల చొప్పున మొత్తం 240 జట్లు ఇందులో పోటీపడతాయి. ముందుగా 7 నుంచి జోనల్ స్థారుులో పోటీలు జరుగుతాయి. ఇందులో విజేతగా నిలిచిన 10 జట్లు రాష్ట్రస్థాయి టోర్నీలో తలపడతాయి. .
జనవరి 17 నుంచి ఈ పోటీలు మొదలవుతాయి. సుభాష్ చంద్రబోస్ జయంతి అయిన 23వ తేదీన ఫైనల్ పోరును నిర్వహిస్తారు.
ఈ మ్యాచ్ ఎల్బీ స్టేడియంలో జరుగుతుంది. జోనల్ స్థాయి విన్నర్స్‌కు రూ. 30 వేలు, రన్నర్స్‌కు రూ. 15 వేలు, రాష్ట్రస్థాయి గ్రాండ్ ఫైనల్స్ విజేతకు రూ. 3 లక్షలు, రన్నరప్ జట్టుకు రూ. 1.5 లక్షలు ప్రైజ్‌మనీ అందజేస్తారు. ఇందులో పాల్గొనాలనుకునే ఆసక్తిగల జట్లు వచ్చే నెల 2 నుంచి 4వ తేదీ వరకు జిల్లా కేంద్రాల్లో ఉన్న తెలంగాణ జాగృతి కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. మరిన్ని వివరాలకు 040-40213214 ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చు.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







