బాగ్దాద్ లో బాంబు పేలుళ్లు : 19 మంది మృతి..
- December 31, 2016
ఇరాక్ రాజధాని బాగ్దాద్ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. నిత్యం రద్దీగా ఉండే సెంట్రల్ బాగ్దాద్ మార్కెట్ ప్రాంతంలో శనివారం రెండు బాంబులు పేలాయి. ఈ ఘటనలో 19 మంది వరకు మరణించగా, 43 మంది ప్రజలు గాయపడ్డట్టు ఇరాక్ పోలీసులు తెలిపారు. ఉదయం పూట రద్దీగా ఉండే ఆల్-సైనిక్ ప్రాంతంలోని దుకాణాల వద్ద ఈ బాంబు పేలుళ్లు సంభవించాయని పోలీసులు పేర్కొన్నారు.
వీటిలో ఒకటి ఆత్మాహుతి దాడిగా అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఇరాక్ అంతర్యుద్ధం తారస్థాయికి చేరుకోవడంతో అక్టోబర్ 17 నుంచి బాగ్దాద్ లో హైఅలర్ట్ లో ఉంది. గత కొన్ని నెలలుగా జిహాదిస్ట్ గ్రూప్ బాగ్దాద్ లో పలు ఘటనలకు పాల్పడుతూ ఇరాక్ ను దద్దరిలిస్తోంది.
అయితే శనివారం దాడి ఎవరి చేశారన్నది ఇంకా తెలియరాలేదు. దాడులకు బాధ్యులుగా ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకోలేదు.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







