యెమెన్ మృత్యుఘోష
- September 09, 2015
యెమెన్ సంక్షోభం ఇంకా కలవరపెడుతూనే వుంది. ఏ క్షణం ఏమవుతుందో తెలీని పరిస్థితులు నెలకొంటున్నాయి. తుపాకుల శబ్దాలు, వైమానిక దాడుల మోతతో హోరెత్తుతోంది. ఇలాంటి భీతావహ వాతావరణం... పౌరులకు కంటిమీద కనుకు లేకుండా చేస్తోంది. చమురు స్మగ్లర్లను మట్టుబెట్టడమే లక్ష్యంగా...... చమురు స్మగ్లర్లను మట్టుబెట్టడమే లక్ష్యంగా సౌదీ వాయుసేనలు విరుచుకుపడ్డాయి. వైమానిక దాడులతో బీభత్సం సృష్టించాయి. ఈ దాడుల్లో 20 మంది భారతీయులు మృతిచెందినట్లు తెలుస్తోంది. యెమెన్ లోని హుదైదా పోర్టు సమీపంలో సౌదీ దేశాల వాయుసేనలు సంయుక్తంగా ఆయిల్ స్మగ్లర్లపై దాడులు చేపట్టాయి. ఈ దాడుల్లో పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. వైమానిక దాడుల్లో రెండు బోట్లు ధ్వంసం?.... వాయుసేనలు ఆకస్మికంగా చేసిన దాడిలో రెండు బోట్లు ప్రమాదానికి గురైనట్లు స్థానికులు, మత్యకారులు చెబుతున్నారు. ఈ ఘటనలో భారత దేశానికి చెందిన కార్మికులు అధిక సంఖ్యలో మృతి చెంది ఉండవచ్చని వారు అనుమానిస్తున్నారు. వాయుసేనలు చేసిన దాడుల్లో 12 మంది తిరుగుబాటు దారులు కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. గతవారం తిరుగుబాటు దారులు చేసిన దాడిలో సుమారు 60 మంది ఎమిరేట్స్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







