చిన్నారుల భద్రత కోసం రాయల్ ఒమాన్ పోలీస్ ఆన్లైన్ డ్రైవ్
- September 09, 2015
ఒమాన్ లోని బిద్ బిద్ లో, ఒంటరిగా బస్సులో వదిలివేయబడడం వల్ల ఊపిరాడక 4 సంవత్సరాల బాలిక మరణం అనంతరం, రాయల్ ఒమన్ పోలీస్ (ఆర్. ఓ. పి.) వారు చిన్నారుల భద్రత కోసం ఆన్లైన్ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. వాహనానికి తాళంవేసి వెళ్ళిపోయెముందు అందరు చిన్నారులు దిగి వెళ్లినట్టుగా డ్రైవర్లు ధృవపరచుకోవడం తప్పనిసరి అని పోలీసువారు అంటుండగా, పిల్లలను రవాణా చేయడం అనేది అధిక శ్రద్ధవహించవలసిన విషయం; పిల్లలకు ఎప్పుడూ ఏదో ఒక సహాయం అవసరమవడం సహజం; డ్రైవరు ప్రతిచోట ఆగి, పిల్లలను సరిగ్గా దిగారా లేదా అని గమనించవలసిన పరిస్థితిని కేవలం కొద్దిమంది మాత్రమే ఒంటరిగా చక్కదిద్డగలరని ఇందుకు సహాయకులు అవసరమని, ఐతే సహాయకులకు ప్రభుత్వం వీసాలు మంజూరు చేయడం లేదని, ఇకనైనా కనీసం స్కూలు బస్సుల సహాయకులకు వీసా మంజురుచేయడం అత్యవసరమని, 30 ఏళ్లుగా మస్కట్ లో డ్రైవరుగా పనిచేస్తున్న ఎన్.ఎస్. రాజీవ్ వివరించారు. ఏదిఏమైనా తమ పిల్లలను సురక్షితంగా అప్పగించడం ట్రా న్స్పోర్టర్ బాధ్యత అని తల్లిదండ్రుల వాదన. గత సంవత్సరం కూడా ఇలాగే బలైపోయిన ఇద్దరు, ఇంకా ఎందరో తల్లితండ్రుల గర్భశోకాన్ని అరికట్టడానికి ప్రభుత్వం ఇకముందైనా కచ్చితమైన చర్యలు తీసుకోవాలన్న ది నిర్వివాదాంశం.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతులపై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు







