మళ్లీ వాయదా పడ్డ 'రుద్రమదేవి'
- September 09, 2015
గుణశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన రుద్రమదేవి మరోసారి వాయిదా పడినట్లు సమాచారం. తొలి ఇండియన్ స్టీరియో స్కోపిక్ త్రీడి చిత్రంగా భారీ వ్యయంతో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఆర్ధిక సమస్యలతో పాటు ఇతర కారణాల వల్ల ఇప్పటికే ఈ సినిమా చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబర్ 9న సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా, ఆ రోజు కూడా రుద్రమదేవి ప్రేక్షకుల మందుకు వచ్చే అవకాశాలు కనిపించటం లేదు. ఇంకా ఆర్థిక సమస్యల నుంచి తేరుకోకపోవటంతో, పాటు గ్రాఫిక్స్ వర్క్ కూడా పూర్తి కాకపోవటంతో సినిమా రిలీజ్ ను మరోసారి వాయిదా వేయాలని భావిస్తున్నారట. చారిత్రక కథాంశం కావటంతో సినిమాలో చాలా భాగం గ్రాఫిక్స్ మీదే ఆధారపడి ఉంది. దీనికి తోడు తొలి స్టీరియెస్కోపిక్ త్రీడి చిత్రం కావటం, ఆ టెక్నాలజీ మన దగ్గర పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవటం లాంటి సమస్యల కారణంగా సినిమా ఆలస్యం అవుతూ వస్తోంది. అక్టోబర్ 9న రిలీజ్ కష్టమే అని తేలిపోవటంతో మళ్లీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఎదురుచూస్తున్నారు. రుద్రమదేవి పాత్రలో అనుష్క, రానా, అల్లు అర్జున్ లు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. కృష్ణంరాజు, ప్రకాష్ రాజ్, బాబాసెహగల్ లాంటి భారీ తారాగణం ఈ సినిమాలో కనిపించనున్నారు. ఇళయరాజ సంగీతం అందిస్తుండగా, గుణటీం వర్క్స్ బ్యానర్ పై గుణశేఖర్ ఈ సినిమాను స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహించాడు.
తాజా వార్తలు
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!







