దుబాయ్ నివాసి జయ నరసింహరావు గారికి 'దుబాయ్ ఘంటసాల' బిరుదుప్రదానం

- September 10, 2015 , by Maagulf
దుబాయ్ నివాసి జయ నరసింహరావు గారికి 'దుబాయ్ ఘంటసాల' బిరుదుప్రదానం

దుబాయ్ నగరంలో  తెలుగు వారైన జయ నరసింహ రావు గారుస్థానిక గాయకులు మరియు గత సంవత్సరం మే నెలలో స్థాపించబడిన మ్యూజిక్ లవర్స్ ఫాక్టరీ (MLF) యొక్క వ్యవస్థాపక అధ్యక్షుడు.

వీరు దుబాయ్ నగరంలో హిందీ మరియు తెలుగు భాషలలో అనేక విజయవంతమైన సంగీత కార్యక్రమాలను చేసియున్నారు. వారి సంస్థ త్వరలోనే అంటే నవంబరులో వార్షికోత్సవం జరుపుకోనుంది.

గతనెలహైదరాబాదు త్యాగరాయ గానసభా హాలులోడా. శరత్ చంద్ర గారి ఆధ్వర్యంలో  జరిగిన "పాట విందు-పద్యం పసందు" కార్యక్రమంలో తెలుగు సినిమాకే మాస్టారు ఐన  ఘంటసాల గారి గాత్రాన్నిఅనుకరిస్తూ పాడిన పాటలకు మెచ్చిడా. సి. నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా ఈయనకు,  'దుబాయ్ ఘంటసాలబిరుదునిచ్చి గౌరవించారు.  శ్రీ రావు గారు ఆలపించిన గీతాలకు పరవ శలైన ఆహూతులుదుబాయ్ ఘంటసాల అనే బిరుదు సార్ధకమైనదని అభిప్రాయపడుతూఘంటసాల వారి పాటలను దుబాయిలో వినిపించివ్యాప్తి చేస్తున్నందుకు ఆయనను మనసారా అభినందించారు.

 

 శ్రీ జయ నరసింహ రావు గారికి మాగల్ఫ్.కాం తరుపున ప్రత్యేక శుభాకాంక్షలు.

 

--సి.శ్రీ(దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com