దేవ కట్టా దర్శకత్వంలో శర్వానంద్‌..

- January 03, 2017 , by Maagulf
దేవ కట్టా దర్శకత్వంలో శర్వానంద్‌..

టాలీవుడ్‌ నటుడు శర్వానంద్‌ కథానాయకుడిగా దేవకట్ట దర్శకత్వంలో 2010లో విడుదలైన 'ప్రస్థానం' చిత్రం విజయం అందుకుంది. 'గమ్యం' తర్వాత ఈ చిత్రంతో శర్వానంద్‌ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అయితే ఇప్పుడు మళ్లీ దేవ కట్టా దర్శకత్వంలో శర్వానంద్‌ ఓ చిత్రంలో నటించబోతున్నట్లు సమాచారం. ఇటీవల దర్శకుడు శర్వానంద్‌ను కలిసి కథ చెప్పారని, ఆయనకు కథ బాగా నచ్చి నటించడానికి ఆసక్తి కనబరిచారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

సతీశ్‌ వేగేశ్న దర్శకత్వంలో శర్వానంద్‌ నటించిన 'శతమానం భవతి' చిత్రం జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com