రూ.500 నోట్లు బంద్.. రూమర్స్‌ పై కేంద్ర ప్రభుత్వం వివరణ

- January 03, 2026 , by Maagulf
రూ.500 నోట్లు బంద్.. రూమర్స్‌ పై కేంద్ర ప్రభుత్వం వివరణ

న్యూ ఢిల్లీ: భారతదేశంలో కరెన్సీ నోట్ల విషయంలో ఏ చిన్న రూమర్ వచ్చినా ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ముఖ్యంగా నోట్ల రద్దు అనగానే 2016 నవంబర్ 8న జరిగిన సంఘటన చాలామందికి వెంటనే గుర్తుకొస్తుంది. ఆ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా రూ.1000, రూ.500(500) విలువైన పాత నోట్లు చెల్లవని ప్రకటించింది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా లక్షలాది మందిపై ప్రభావం చూపింది. బ్యాంకులు, ఏటీఎంల వద్ద భారీ క్యూలు, నగదు కొరత వంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఆ నిర్ణయం తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త డిజైన్‌లో రూ.500, రూ.2000 కొత్త నోట్లను చెలామణిలోకి తీసుకొచ్చింది. కొంతకాలం పాటు ఈ రెండు నోట్లు దేశవ్యాప్తంగా విస్తృతంగా వినియోగంలో ఉన్నాయి. అయితే కాలక్రమేణా పెద్ద మొత్తాల లావాదేవీలను నిరుత్సాహపరచాలనే ఉద్దేశంతో RBI రూ.2000 నోట్ల వినియోగాన్ని క్రమంగా తగ్గించడం ప్రారంభించింది. చివరకు మే 2023లో రూ.2000 నోట్లను చెలామణి నుండి ఉపసంహరిస్తామని.. ప్రజలు తమ దగ్గర ఉన్న నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయవచ్చని లేదా మార్పిడి చేసుకోవచ్చని అధికారికంగా ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com